మెప్పు కోసం తప్పులు.. జగన్ రాజకీయం బెడిసికొడుతుందా ..?  

Ys Jagan Over Believing About Bjp Party-

అవకలశాలు కొన్ని సార్లే వస్తాయి. అవి వచ్చినప్పుడే సక్రమంగా ఉపయోగించుకుని లాభపడాలి తప్ప వాటిని చేజార్చుకుంటే ఆ తరువాత తిప్పలు తప్పవు. ఈ విషయంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కి ఇంకా సరైన క్లారిటీ వచ్చినట్టు కనిపించడంలేదు. అందుకే అందివచ్చిన అవకాశాలను వదులుకొని రాజకీయంగా కోలుకోలేని తప్పు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏపీలో వైసీపీ కి ఇప్పటివరకు అధికారం దక్కలేదు. రాజకీయ చాణిక్యుడు అపర మేధావి అయిన తన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడుని ఢీ కొట్టాలంటే వ్యూహాలు మాములు రేంజ్ లో ఉండకూడదు. కానీ అందివచ్చిన కొన్ని అవకాశాలను జగన్ పక్కపార్టీలకు అప్పజెప్పి చేజేతులా పార్టీని నాశనం చేసుకుంటున్నాడనే విమర్శలు వస్తున్నాయి.

YS Jagan Over Believing About BJP Party-

YS Jagan Over Believing About BJP Party

ప్రభుత్వంలో దశాబ్దాల అనుభవం, చంద్రబాబు ఆలోచనలు దగ్గరగా చూసిన వ్యక్తులను ఆయన కావాలనే వదిలేసుకుంటున్నారు. తాజాగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బీజేపీలో చేరారు. సీనియర్ ఐఏఎస్ అధికారి, చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వంలో ఎన్నో కష్టనష్టాలు, అవకతవకలు, లోటుపాట్లు, ముఖ్యంగా చంద్రబాబు మనస్తత్వాన్ని, అత్యంత కీలక సందర్భాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలను, ఎత్తుగడలను, పరిపాలనా పరంగా అనుసరించిన వ్యూహాలను, రాజధాని భూముల వ్యవహారంలోని లొసుగులు, స్కామ్ లు స్కీమ్ లు.ఇలా అనేక అంశాలను దగ్గరగా చూసిన వ్యక్తి ఐవైఆర్. అలాంటి ఐవైఆర్ ను జగన్ తన పార్టీలో ఎందుకు చేర్చుకోలేకపోయారు ? బ్రాహ్మణ సామాజికవర్గం ఓట్లును ఎందుకు ఆకర్షించలేకపోయారు ? ఐవైఆర్ బీజేపీలో చేరతారని తెలిసినా, ఆయన్ను ఆపి తమ పార్టీలో చేర్చుకోలేకపోవడం ముమ్మాటికీ జగన్ రాజకీయ వైఫల్యమే.

ఇదొక్కటే కాదు గతంలో కన్నా లక్ష్మీనారాయణ కూడా వైఎస్ఆర్ సీపీలో చేరబోయి, ఆఖరి నిముషంలో బీజేపీ లో చేరారు. అమరావతి ప్రాంతంలో కాపు సామాజికవర్గం నాయకుడిగా నాలుగైదు నియోజకవర్గాల్లో కన్నాకు గట్టి పట్టుంది. అలాంటి నాయకుడు వైఎస్ఆర్ సీపీలో చేరితే కచ్చితంగా ఆ పార్టీకి లాభమే. కానీ బీజేపీ పెద్దలతో రహస్యస్నేహం వల్ల, కన్నాను బీజేపీకే త్యాగం చేశారు జగన్. కన్నా లక్ష్మీనారాయణ, ఐవైఆర్ కృష్ణారావు ఇద్దరూ వైఎస్ఆర్ సీపీలో చేరడానికి ప్లాన్ చేసుకున్నవారే. వారి చేరికతో ఆ పార్టీకి లాభమే తప్ప నష్టం లేదు. కానీ జగన్ బీజేపీ నేతల ఒత్తిడికి తలొగ్గి వారిని బీజేపీకి అప్పజెప్పారు.

YS Jagan Over Believing About BJP Party-

జగన్ కు బీజేపీ తో రహస్య పొత్తు ఉంది ఉండవచ్చు అంతమాత్రాన తనకు రాజీకీయ మైలేజ్ వచ్చే వాటిని వదులుకుని ఏపీలో పెద్దగా అదరణలేని బీజేపీ అలోపేతం కోసం జగన్ కష్టపడాల్సిన అవసరం ఏముంది ? జగన్ పార్టీలో చేరాలనుకునే వారిని బలవంతంగా బీజేపీలో చేర్చేస్తే రేపు బీజేపీ పెద్దలు జగన్ పార్టీకి మేలు చేస్తారన్నది ఎంతవరకూ నమ్మవచ్చు. ముందు ముందు మరికొంతమంది ఏపీకి చెందిన నాయకులు బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ఈ విషయంలో జగన్ సహకారం కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ వైసీపీకి నష్టం చేకూర్చేవే. మరి జగన్ ఇప్పటికైనా ఆ తలపులు తెలుసుకుంటాడో లేక అలవాటైన ఆ తప్పులనే చేస్తూ ఉండిపోతాడో చూడాలి.