జనసేనలో చేరబోతున్న అక్కుమ్ బక్కుమ్ ..?  

Yamaleela Actor Ali Wants Join In Janasena Party-

Kamaliyan Ali, who is fame with the dialogues of Akkam Bakkam, has been reduced to a number of career opportunities. That is why he thinks this is the right time to be active in politics. The news also reported that during the 2014 Lok Sabha elections, Ali would be contesting from Rajahmundry for the TDP and the Guntur East constituency. But in that context, Ali told the media that Pawan Kalyan, a close friend of the party, said he would join the party.

.

But Pawan's political party has long been a long time ... In the recent past, the inclusion of the leaders has become intolerable. Ali has been making arrangements to join the JanaSan as there is no time for general elections. . Freshly ... Pawan Kalyan is going to pray at Bara Shaheed Dargah in Nellore district and get out of the loaves of bread .. Ali along with him along with the consequences that he is going to be there to see that he is near the time of arrival in Janesena. .

. Even though Pawan Kalyan's party was put up, it was not actively functioning. In the last few months, the party actively activates the party and runs the party. Ali is again reacting to the introduction of the political field in the wake of Ali Nellore's pilgrimage with Pawan Kalyan. The news is that he will be in the race for Jassean in the upcoming elections. However, Clarity does not yet appear on where he competes. Pawan is also happy with Ali. But Ali keeps on the royal palace .. It is his own area and hence looking to get from there to some point. .

యమలీల సినిమాలో అక్కుమ్ బక్కుమ్ అనే డైలాగుతో ఫేమస్ అయిన కమెడియన్ ఆలీకి ఏ మధ్యకాలంలో సినీ అవకాశాలు తగ్గాయి. అందుకే ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నాడు. 2014 ఎన్నికల సమయంలోనే ఆలీ, తెలుగుదేశం పార్టీ తరఫున రాజమండ్రి నుంచి గానీ, గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి గానీ ఎన్నికల్లో పోటీచేస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఆ సందర్భంలోనే ఓసారి ఆలీ మీడియాతో మాట్లాడుతూ సినీరంగంలో తనకు బాగా మిత్రుడైన పవన్ కల్యాణ్ పార్టీ పెడితే తాను కూడా అందులో చేరుతానని ప్రకటించారు ..

జనసేనలో చేరబోతున్న అక్కుమ్ బక్కుమ్ ..? -Yamaleela Actor Ali Wants Join In Janasena Party

అయితే పవన్ రాజకీయ పార్టీ పెట్టి చాలా కాలం అవుతున్నా… ఈ మధ్యనే నాయకుల చేరికలు ముమ్మరం అయ్యాయి. ఇక సాధారణ ఎన్నికలకు కూడా పెద్దగా సమయం కూడా లేకపోవడంతో జనసేనలో చేరేందుకు ఆలీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది.

తాజాగా… నెల్లూరు జిల్లా బారా షహీద్ దర్గా వద్ద ప్రార్థనలు చేసి, రొట్టెలు విడవడానికి పవన్ కల్యాణ్ వెళ్తోంటే. ఆయన వెంట ఆలీ కూడా అక్కడకు వెళ్తుండడం ఆయనతో పాటు పాల్గొనడం అనే పరిణామాలను గమనిస్తోంటే ఆలీ జనసేనలో చేరే సమయం దగ్గర్లోనే ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి..

పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినప్పటికీ మొన్నటిదాకా దానిని క్రియాశీలంగా నిర్వహించలేదు. గత కొన్నినెలలుగా మాత్రమే పార్టీని యాక్టివేట్ చేసి ముమ్మరంగా పార్టీని నడుపుతున్నారు. ఇప్పడు పవన్ కల్యాణ్ తో కలిసి ఆలీ నెల్లూరు యాత్రలో పాల్గొంటున్న నేపథ్యంలో ఆలీ రాజకీయ రంగ ప్రవేశంపై మళ్లీ వార్తలు వస్తున్నాయి. ఆయన రాబోయే ఎన్నికల్లో జనసేన తరఫున ఖచ్చితంగా పోటీలో ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనే విషయాలపై ఇంకా క్లారిటీ అయితే కనిపించడంలేదు. ఆలీ చేరికపై పవన్ కూడా ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆలీ చూపు రాజముండ్రి మీద ఉన్నటు ..

అది తన సొంత ప్రాంతం కనుక అక్కడి నుంచి ఏదో ఒక స్థానం నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నాడు.