'నా భార్యను నాకు అప్పగించండి.' కంటతడిపెట్టిన భర్త.! పోలీసులు ఏమన్నారంటే.?  

  • నా భార్యను నాకు అప్పగించండి మీడియా ముందు ఓ భర్త కంటది పెడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇద్దరి మతాలు వేరైనా వారి మనుసులు కలిశాయి. తోడునీడగా ఉండాలని కలలు కన్నారు. కన్నవారిని ఎదిరించి కులం గోడలు దాటి ఒక్కటయ్యారు. మనసు ఇచ్చిన ప్రియుడి కోసం పేరు కూడా మార్చుకుంది ఆ ప్రియురాలు. ఆర్యసమాజ్‌ సాక్షిగా ఆ జంట ఒక్కటైంది.వివరాలలోకి వెళ్తే…

  • బేగంబజార్‌కు చెందిన రాజు-నాజ్నీన్ అనే యువతి యువకులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్యసమాజ్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. నాజ్నీన్ హిందూ మతాన్ని స్వీకరించి తన పేరును పూజగా మార్చుకుంది.

  • Wife Abducted By In-laws Husband Raju-

    Wife Abducted By In-laws Husband Raju

  • అయితే ఈ నెల 17 నుంచి ఆ యువతి కన్పించకుండా పోయిందని ఆమెను తన కుటుంబసభ్యులు కిడ్నాప్‌ చేశారని రాజు ఆరోపిస్తున్నాడు. పరువు కోసం తన భార్యను చంపుతారని పోలీసులను ఆశ్రయిస్తే పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం తన భార్య 4 నెలల గర్భవతని ఆమెకు అబార్షన్ చేయిస్తానని తండ్రి బెదిరిస్తున్నాడని రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పరువు కోసం తన భార్యను చంపుతారని… ఆమెను తనకు అప్పగించాలని రాజు మీడియా ద్వారా తెలిపాడు.