ఇంట్లో ఏ మొక్కలు పెంచాలి.. ఏవి పెంచకూడదు..ఏఏ మొక్కల్ని ఏ దిశలో పెంచాలి.. మనీప్లాంట్ ని ఈశాన్యంలో పెంచితే నష్టమేంటి..తెలుసుకోండి.  

Which Plant Is Useful And Where To Place The Plant In Our Home-

There is a lot of things to do when you build a house. But there are small mistakes that you can not even know about. Many people have a habit of growing plants outside of the house. It's a good idea to grow plants, what is it for them? We need to plant a good place in our house So we do not get to know the exact stage, direction What good plants do you need? No plants should be grown .. what should not be raised .. where to increase .. where to grow .. for the full details ..

· Those who grow plants in the house are not opposite the lion, but do not raise trees outside the windows. By doing this, there is a danger to the home owner.

· To grow all kinds of fruit trees in the east or north, leave the most empty place and increase the trees in the other areas. · Tulsi, Billu, Jammy, Ursiri, Neema, Saraswathi plant, Brahmakalam, Rudraksha, Marumana, Duvana, Purna, Kadambam etc. If the plants are in the direction we like, they do not grow. These are at least five feet away from the compound wall of the house Natalie ..

· Thulasi plant can be raised in the southwest corner of Kundil or Tulsi Fortress in the south of the house. Under no circumstances should the ground be planted .

Should be in front of the Thulaccio gum in the houses of the Western or South canals. The north gate is in turmeric in the northwest of the house. If you use the tulsi to the house to the west or south, experts say that the atmosphere around the plant is always positive. It is also believed that it gives them strength and luck in the house. But do not leave the money plant wherever you are. Manipalant in the northeastern part of the house is more than a loss. Not everything is dissolving but they are at home in the sick. Always keep the plant in the southeast. This is the favorite direction of Vigneshwar. In this order the plant is kept in good luck and good luck to the house ..

. · Inside the house premises without thornbirds. Do not even stay outside the house in the garden. These are your worries. But in this case the rose plant is exception ...

. · Most of the bamboo plants are housed as 'indoor plants' in their homes. Increasing the bamboo plants in houses increases the 'money strength' .Bambubatri belongs to the Buddha planet in our Navagrahas. Mercury is a business growth factor and business trading is in the forefront of trading. This is very good for the prevention of salinization in business enterprises. To educate, and to cleanse the vaccine. When children are placed at the reading table, ideas can be remembered for good intelligence, attention on the readers, and recurring thoughts (time of trial). The bamboo plant growth is seen to rise to higher levels of life, and the feeling of developing a higher level of life.

. · Banana tree should be taken south direction. Coconut tree should be grown in the south-west direction. It is not difficult to plant in the south-east, northwest

· Almond tree should not be raised on the opposite side of the house. Lakshmi Prasad raised the betel plant at home. Southern direction is good for this plant. The house should be at least fifty feet away. · Plants are grown in pots can be placed in the south, west, southwest, southeast and northwest. Do not place pots in the east, north and northeast. Tulasi can not be grown in the pots of flowers that grow the plant. Vegetable plants can be grown in the home premises rather than the northeast direction.

· Increase the number of trees in the area with a fertile compound wall at least fifty feet away, including milking trees, barbed wire, girinta, jovi, worries, fur, jaggery, mushrooms, apricots, plums, cashew mango, poca, This means that the place where the plants are grown should be irrelevant to the home. The gate that goes into it should also be unique. Doing this is good for people living at home.

ఇంటిని నిర్మించేప్పుడు చాలామంది వాస్తుపరంగా వుండేట్లు చూసుకుంటారు.కానీ తెలిసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు...

ఇంట్లో ఏ మొక్కలు పెంచాలి.. ఏవి పెంచకూడదు..ఏఏ మొక్కల్ని ఏ దిశలో పెంచాలి.. మనీప్లాంట్ ని ఈశాన్యంలో పెంచితే నష్టమేంటి..తెలుసుకోండి.-Which Plant Is Useful And Where To Place The Plant In Our Home

చాలామంది ఇంట్లో,ఇంటి బయట మొక్కలు పెంచుకునే అలవాటు ఉంటుంది.మొక్కలు పెంచడం మంచిదే కదా,వాటికి వాస్తు ఏంటి అంటారా.అవసరమే.మనం మొక్కలు పెంచే స్థలం కూడా మన ఇంట్లో మంచి చెడుని నిర్ణయిస్తుంది.

కాబట్టి వాస్తు ప్రకారం ఖచ్చితమైన దశ, దిశ తెలుసుకొని మనం నడుచుకుంటే అన్నీ శుభఫలితాలే వస్తుంటాయి.ఇంట్లో ఏ ఏ మొక్కలు పెంచాలి.

ఏవి పెంచకూడదు.ఎక్కడ పెంచాలి.ఎక్కడ పెంచకూడదు.

మొదలైన పూర్తి వివరాలు మీకోసం.

· ఇంట్లో మొక్కలని పెంచుకునే వారు సింహ ద్వారానికి ఎదురుగా కాని, కిటికీల పక్కన కాని చెట్లను పెంచకూడదు. ఇలా చేయటం వలన ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం వుంది...

· అన్ని రకాల పండ్ల చెట్లను పెంచాలనుకునేవారు ఇంటికి తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా ఖాళీ స్థలం వదిలి మిగతా దిక్కుల్లో ఈ చెట్లను పెంచాలి.

· తులసి, బిల్వం, జమ్మి, ఉసిరి, వేప, సరస్వతి మొక్క, బ్రహ్మకమలం, రుద్రాక్ష, మరువం, దవనం, పున్నాగ, కదంబం మొదలైన దేవతా మొక్కల్ని మనం ఇష్టం వచ్చిన దిశలో పెడితే అవి పెరగవు. వీటిని ఇంటికి ఆగ్నేయ దిశగా కాంపౌండ్ వాల్‌కి కనీసం ఐదు అడుగుల దూరంలో నాటాలి.

· తులసి మొక్కను తూరుపు ద్వారం ఇంటికి ఆగ్నేయ దిశలో కుండీలో లేదా తులసి కోటను కట్టి దాంట్లో మాత్రమే పెంచాలి. ఎట్టి పరిస్థితుల్లో నేలమీద నాటకూడదు.

· పడమర లేదా దక్షిణ వాకిళ్ల ఇళ్లలో తులసికోట గుమ్మానికి ఎదురుగా వుండాలి. ఉత్తర ద్వారం ఇంటికి వాయవ్యంలో తులసికోట వుండాలి.

తులసి వాడిపోతే తులసిని గృహమునకు పశ్చిమము లేదా దక్షిణంలోఉంచుకోవడం చాలా మంచిదని వాస్తు నిపుణులు అంటున్నారు...

· మనీ ప్లాంట్ మొక్క చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటుందని అంటారు. అంతే కాకుండా ఇది ఇంట్లో వాళ్లకు శక్తినీ, అదృష్టాన్ని ఇస్తుందనేది కొందరి నమ్మకం.

అయితే మనీ ప్లాంట్ ను ఎక్కడబడితే అక్కడ ఉంచకూడదు. ఇంట్లోని ఈశాన్య భాగంలో మనీప్లాంట్ ఉంచితే లాభం కంటే నష్టమే ఎక్కువ. ఉన్నదంతా కరిగిపోవడమే కాదు ఇంట్లో వాళ్లు అనారోగ్యాల బారిన పడతారట.

ఈ ప్లాంట్ ను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలట. ఇది విఘ్నేశ్వరుడికి ఇష్టమైన దిక్కు.

ఈ క్రమంలో ప్లాంట్ ను ఉంచితే అదృష్టం బాగా కలిసొచ్చి ఇంట్లో వాళ్లకు శుభం కలుగుతుందట.

· ఇంటి ఆవరణలో ముళ్ల మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాంటివి గార్డెన్‌లోనూ. ఇంటి బయట కూడా పెట్టుకోవద్దు. ఇవి మీ దురదృష్టాన్ని శంకించేవిగా ఉంటాయి. అయితే ఇందులో గులాబీ మొక్కకు మాత్రం మినాహాయింపు ఉంటుంది.

· వెదురు మొక్కలను గృహాలకంరణలో భాగంగా చాలా మంది తమ ఇళ్లలో ‘ఇండోర్ మొక్కలుగా’ పెంచుకుంటున్నారు. వెదురు మొక్కలను ఇళ్లలో పెంచితే ‘ధన బలం’ పెరుగుతుంది .బ్యాంబుట్రీ మన నవగ్రహాలలో బుద గ్రహానికి చెందినది. బుధుడు వ్యాపార వృద్ది కారకుడు కావటం వలన ఇది వ్యాపార సంస్థలలో ఉంచితే వ్యాపారం దిన దినాభివృద్ధి చెందుతుంది.

వ్యాపార సంస్థలలో నరదిష్టి నివారణకు ఇది చాలా మంచిది. విద్యకి, వాక్ శుద్దికి బుదుడు కారకుడు. పిల్లలు చదువు కొనే టేబుల్ దగ్గర ఉంచితే మంచి తెలివితేటలు ,చదువుపై శ్రద్ద, సరియైన సమయంలో (పరీక్ష సమయములలో ) గుర్తుకు వచ్చే ఆలోచనలు (క్రియేటివిటి) కలుగుతాయి.

జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని వెదురు మొక్క పెరుగుదలను ప్రత్యక్షంగా చూడటం వల్ల జీవితంలో ఉన్నత స్ధాయికి ఎదగాలనే భావన కలుగుతుంది.ఇంటిలో ఏమైనా వాస్తు దోషాలు ఉన్న, వీధిపోటు ఉన్న ఇంటిలో సింహా ద్వారానికి ఎదురుగా ఉంచితే వెదురు మొక్కను ఉంచితే మేలు.

· అరటి చెట్టును దక్షిణ దిశలోనే వేసుకోవాలి. కొబ్బరిచెట్టు నైరుతీ దిశలో పెంచాలి. వీలుకాకపోతే ఆగ్నేయం, వాయవ్యంలో పెంచటం ఇబ్బందికరం కాదు.

· బాదం చెట్టును ఇంటి ఎదురుగా పెంచకూడదు...

తమలపాకుల మొక్కను ఇంట్లో పెంచటం లక్ష్మీ ప్రదం. దక్షిణ దిశ ఈ మొక్కకు శుభం. ఇంటికి కనీసం యాభై అడుగుల దూరంలో ఉండాలి.

· పూల మొక్కల్ని కుండీల్లో పెంచుకునేవారు కుండీల్ని ఇంటికి దక్షిణంలో, పడమర, నైరుతి, ఆగ్నేయం, వాయవ్యంలో వుంచవచ్చు. తూర్పు, ఉత్తరం, ఈశాన్యాలలో కుండీలను ఉంచరాదు. తులసి మొక్కను పెంచే కుండీని పూల మొక్కల కుండీల్లో కలిపి పెంచరాదు.

కూరగాయల మొక్కలని ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు.

· పాలు కారే చెట్లు, ముళ్ల చెట్లు, గోరింట, జువ్వి, చింత, మర్రి, కుంకుడు, మునగ, నేరేడు, రేగు, జీడి మామిడి, పోక, అవిశ మొదలైన రకరకాల చెట్లని ఇంటికి కనీసం యాభై అడుగుల దూరంలో సపరేట్ కాంపౌండ్ వాల్ కట్టి ఆ ప్రదేశంలోనే వీటిని పెంచాలి. అంటే ఇంటి వాస్తుకి ఈ మొక్కలు పెంచే ప్రదేశం వాస్తుకి సంబంధం లేకుండా వుండాలి.

దాన్లోకి వెళ్లే గేటు కూడా ప్రత్యేకంగా వుండాలి. ఇలా చేయటం వలన ఇంట్లో నివసించేవారికి మేలు జరుగుతుంది.