బలం లేకపోయినా కేసీఆర్ ధీమా ఏంటి..?  

What Is The Strength Of Kcr In Elections 2019-

ఎన్నికల్లో గెలుపు ధీమా ఉండబట్టే టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికల సమారాలోకి అంత నమ్మకంగా దూకింది. కేసీఆర్ రాజకీయ మేధావి ఎక్కడ ఏ ఎత్తు వేయాలో బాగా తెలుసు అందుకే ఆయన ప్రత్యక్షంగా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల సమరంలోకి దూకేందుకు సిద్ధం అవుతున్నారు. కానీ కొన్ని పార్టీలతో అంతర్గతంగా ఆయన స్నేహబంధం కొనసాగిస్తున్నారు..

బలం లేకపోయినా కేసీఆర్ ధీమా ఏంటి..? -What Is The Strength Of KCR In Elections 2019

న‌వంబ‌రు తొలి వారంలోనే ఎన్నిక‌లు అదే నెల చివ‌రి వారంలోనే రిజ‌ల్ట్‌,, డిసెంబ‌రు రెండో వారం నాటికి కొత్త స‌ర్కారు ఏర్పాటు ఖాయం. అయిన నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో గెలుపొందేందుకు ప్రతి పార్టీ తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

కేవ‌లం జాత‌కాలు, ముహూ ర్తా లు చూసుకునే ప్రభుత్వాన్ని ర‌ద్దు చేశార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో ఎంతో కొంత ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కేసీఆర్‌కు తప్పదు. దీనికి తోడు కుటుంబ రాజకీయాలు కూడా ఆయనకు చేటు తెచ్చేవిధంగా కనిపిస్తున్నాయి. 105 మంది సిట్టింగు ఎమ్మెల్యేల‌కు ఛాన్స్ అన్నారు. ప్ర‌చారం కూడా ప్రారంభించారు. అయితే, సిట్టింగు ఎమ్మెల్యేల్లో 40 మందికి ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉంద‌ని అంటున్నారు. అయినా కేసీఆర్ టికెట్లు ఇచ్చా రు అంటే కేసీఆర్ లో ఏదో ధీమా ఉండే ఉంది ఉంటుందని అంతా అనుకుంటున్నారు..

తెలంగాణ ప్ర‌జ‌లు త‌న‌వెంటే ఉన్నార‌ని కేసీఆర్ ప్ర‌గాఢంగా విశ్వసిస్తున్నారు. ఇక‌, ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు కూడా ఆయ‌న‌కు మేలు చేస్తాయ‌నేది కేసీఆర్ భావ‌న‌. మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే తెలంగాణ లోని ప్ర‌ధాన మీడియా మొత్తం ఆయ‌న చేతిలోనే ఉండ‌డం. దీంతో కేసీఆర్ గెలుపు ఖాయ‌మేన‌న్న అంచ‌నాలు నిన్న‌టి వ‌ర‌కు ఉన్నాయి.

కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితిలో మాత్రం కాస్త మార్పు క‌నిపిస్తోంది. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, మ‌హాజ‌న‌స‌మితి కూట‌మి క‌డుతుండ‌డంతో కేసీఆర్ గెలుపు మ‌రి అంత సులువు కాద‌న్నవిషయంలో కేసీఆర్ మరిచిపోకూడదు. కానీ టీఆర్ఎస్ రహస్య మిత్రుల అండతో మళ్లీ అధికారం చేజిక్కించుకోవచ్చనే అంచనాలు కూడా కేసీఆర్ లో కనిపిస్తున్నాయి..