మంచి దొంగ వీడియో : కత్తి చూపించి డబ్బులు లాక్కున్నాడు... అది చూసిన తర్వాత మళ్లీ ఆ డబ్బు వెనక్కు ఇచ్చేశాడు  

Watch Robber Returns Money After Checking Woman\'s Bank Balance-robber In China,woman\\'s Bank Balance

మంచి దొంగలు అనే వారు సినిమాల్లో ఉంటారు కాని నిజ జీవితంలో ఉండరు అనేది చాలా మంది అనుకునే విషయం. అయితే నూటికో కోటికో ఒక్కరు ఇద్దరు మంచి దొంగలు ఉంటారు అని మరోసారి నిరూపితం అయ్యింది. చైనాలోని ఒక దొంగ ఇప్పుడు ప్రపంచం మొత్తంతో కూడా మంచి దొంగ అనిపించుకున్నాడు..

మంచి దొంగ వీడియో : కత్తి చూపించి డబ్బులు లాక్కున్నాడు... అది చూసిన తర్వాత మళ్లీ ఆ డబ్బు వెనక్కు ఇచ్చేశాడు-Watch Robber Returns Money After Checking Woman's Bank Balance

అతడు చేసిన పని పట్ల అంతా కూడా ఫిదా అవుతున్నారు. అతడు దొంగతనం చేసేందుకు ప్రయత్నించినా కూడా అతడిలో మానవత్వంను చూసి అంతా అతడు గ్రేట్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతగా ప్రశంసలు దక్కించుకున్నా దొంగతనం కేసులో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… చైనాలోని గ్వాంగ్‌ డాంగ్‌ నగరంలో లీ అనే ఒక మహిళ నగదు విత్‌ డ్రా కోసం ఏటీఎంకు వెళ్లింది. తన ఏటీఎం నుండి నగదు డ్రా చేసింది. డబ్బులు డ్రా చేసిన లీ బయటకు వెళ్లబోతున్న సమయంలో ఒక వ్యక్తి కత్తి తీసుకుని ఏటీఎంలోకి ప్రవేశించాడు. కత్తితో బెదిరించడంతో లీ తన చేతిలో ఉన్న 2500 యువాన్లు అంటే భారత కరెన్సీ ప్రకారం 26 వేల రూపాయలు అతడికి ఇచ్చేసింది.

అవి చాలవు అనుకున్న ఆ దొంగ ఏటీఎంలో ఉన్న మొత్తం కూడా ఇవ్వాలని బెదిరించి మళ్లీ ఏటీఎంను పెట్టించాడు. బ్యాలన్స్‌ ఎంక్వౌరీ చేయగా అందులో జీరో బ్యాలన్స్‌ ఉన్నట్లుగా చూపించింది.

తన ఖాతాలో ఏమీ లేకుండా నగదు డ్రా చేసుకున్న ఆమె పరిస్థితి అతడికి అర్థం అయ్యింది. ఆమె ఆర్థిక కష్టాల్లో ఉన్నట్లుగా అతడు అర్థం చేసుకున్నాడు. అందుకే ఆమె నుండి తీసుకున్న 2500 యువాన్లను తిరిగి ఆమెకు ఇచ్చేసి తాపీగా వెళ్లి పోయాడు. తన డబ్బు తిరిగి తనకు ఇవ్వడంతో ఆమె నోరెళ్ల బెట్టి చూస్తూ ఉండి పోయింది. అతడు మాత్రం తాపీగా నడుచుకుంటూ వెళ్లడం సీసీ కెమెరాలో కనిపించింది..

తన డబ్బు తిరిగి ఇవ్వడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయినా కూడా ఏటీఎంకు వచ్చి కత్తి చూపించి దొంగతనంకు ప్రయత్నించినందుకు గాను అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతుంది.

మీరు ఒక లుక్కేయండి.