ట్యాక్సీవాలా కూడా కుమ్మేస్తాడంటున్న గోవిందం  

Vijay Devarakonda Taxiwala Movie Release Date-

Vijay Devarakonda's 'Geeta Govindam' has come up with fresh audiences. The movie in Parasuram's direction did not create much interest in the audience. When the film first released the film, the film started to talk about the movie. Since then the movie has been released and so on the cinematic expectations of the film so that they went to Peaks. The producer Allu Arvind was released on record. Geeta Govindham finally brought Success Talk.

.

Before the film 'Geeta Govindam', the audience will have to come up with Vijay Devarakonda 'Taksimwala'. But for some reason the film was postponed and brought forward to this picture. The film was first brought to the audience due to the high confidence in Geeta Govindam rather than the taxis of the film. Geeta Govindam's film gets a good touch and now it's all focusing on taxis. . The movie 'Taxi Wawla' is very different. The first release of the first release was made. Vijay Devarakonda has done a very different role in the film. The two big banners have made the film and the expectations on the film are huge. But the film unit members say that some of the mistakes were made during the shooting of the movie, it's been a bit of time to correct the mistakes. .

. The filmmakers believe that Geeta Govindam film Success will definitely give boost to the film. Recently Vijay Devarakonda also said that the movie would be a good movie and the audience would like to have a movie like a movie like a taxi, no doubt there is no doubt. With the release of Geeta Govindham's success, it is possible to announce the date of a taxi.

విజయ్‌ దేవరకొండ ‘గీత గోవిందం’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పరుశురామ్‌ దర్శకత్వంలో మూవీ అనగానే ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి క్రియేట్‌ కాలేదు. ఎప్పుడైతే సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారో అప్పుడు సినిమా గురించి మాట్లాడుకోవడం ప్రారంభం అయ్యింది...

ట్యాక్సీవాలా కూడా కుమ్మేస్తాడంటున్న గోవిందం-Vijay Devarakonda Taxiwala Movie Release Date

అప్పటి నుండి సినిమా విడుదల అయ్యే వరకు సినిమాపై అంచనాలు అలా అలా పెరుగుతూ పీక్స్‌కు వెళ్లి పోయాయి. రికార్డు స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు అరవింద్‌ విడుద చేయడం జరిగింది. గీత గోవిందం చివరకు సక్సెస్‌ టాక్‌ను తెచ్చుకుంది.

‘గీత గోవిందం’ చిత్రంకు ముందు విజయ్‌ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం వాయిదా వేసి ఈ చిత్రాన్ని ముందుకు తీసుకు వచ్చారు. ట్యాక్సీవాలా చిత్రం కంటే గీత గోవిందం విషయంలో ఎక్కువ నమ్మకం ఉన్న కారణంగానే ఈ సినిమాను ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది. గీత గోవిందం సినిమా మంచి టాక్‌ను దక్కించుకున్న నేపథ్యంలో ఇప్పుడు ట్యాక్సీవాలాపై అందరి దృష్టి కేంద్రీకృతం అవుతుంది.

‘ట్యాక్సీవాలా’ చిత్రం చాలా విభిన్నంగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ అందరిని అరించింది. విజయ్‌ దేవరకొండ చాలా విభిన్నమైన పాత్రను ఆ చిత్రంలో చేయడం జరిగింది..

రెండు పెద్ద బ్యానర్‌లు ఆ సినిమాను నిర్మించిన కారణంగా సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కాని సినిమా షూటింగ్‌ సమయంలో కొన్ని తప్పులు జరిగాయని, ఆ తప్పులు సరిచేసేందుకు కాస్త సమయం అయ్యిందని, త్వరలోనే ట్యాక్సీవాలాను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ట్యాక్సీవాలా చిత్రంకు గీత గోవిందం చిత్రం సక్సెస్‌ తప్పకుండా బూస్ట్‌ను ఇస్తుందని సినీ వర్గాల వారు నమ్ముతున్నారు. తాజాగా విజయ్‌ దేవరకొండ కూడా మాట్లాడుతూ తప్పకుండా ట్యాక్సీవాలా కూడా మంచి సినిమా అవుతుందని, తన నుండి ప్రేక్షకులు ఎలాంటి సినిమాను అయితే కోరుకుంటున్నారో ట్యాక్సీవాలా అలాంటి సినిమానే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ ఆయన పేర్కొన్నాడు.

గీత గోవిందం విడుదలైన సక్సెస్‌ దక్కించుకున్న నేపథ్యంలో ట్యాక్సీవాలా తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.