విజయ్‌ దేవరకొండ మూవీ ప్రారంభంకు ముందే వివాదంలో... టైటిల్‌ మార్చక తప్పేలా లేదు  

Vijay Devarakonda Hero Movie Going To Deep Trouble-hero,hero Movie,vijay Devarakonda,vijay Devarakonda Next Movie

విజయ్‌ దేవరకొండ హీరోగా ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో ‘హీరో’ అనే చిత్రంను తాజాగా మైత్రి మూవీస్‌ వారు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. కేవలం తెలుగులోనే కాకుండా ఈ చిత్రం మొత్తం సౌత్‌ ల్యాంగ్వేజస్‌ అయిన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం మరియు ఉత్తరాది భాష అయిన హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అన్ని భాషల్లో కూడా ఈ చిత్రాన్ని ‘హీరో’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లాలని మైత్రి వారు భావిస్తున్నారు.

Vijay Devarakonda Hero Movie Going To Deep Trouble-Hero Hero Vijay Next

Vijay Devarakonda Hero Movie Going To Deep Trouble

బైకర్‌గా ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ కనిపించబోతున్నాడు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కబోతుంది. స్పోడ్స్‌ నేపథ్యంలో రూపొందబోతున్న ఈ చిత్రంను ఎక్కువ శాతం ఢిల్లీలో చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కాని ఈ చిత్రం టైటిల్‌ వివాదంలో చిక్కుకుంది. యూనిట్‌ సభ్యులు ఏమో అన్ని భాషల్లో కూడా ఈ చిత్రాన్ని హీరో అనే టైటిల్‌తో విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే తమిళంలో తాజాగా శివ కార్తికేయన్‌ హీరోగా ‘హీరో’ అనే చిత్రం ప్రారంభం అయ్యింది.

Vijay Devarakonda Hero Movie Going To Deep Trouble-Hero Hero Vijay Next

విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ అన్నామలైల సినిమా అనౌన్స్‌ అయిన వారం రోజుల గ్యాప్‌లోనే శివకార్తికేయన్‌ మూవీ పట్టాలెక్కిస్తున్నట్లుగా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోను విడుదల చేశారు. దాంతో విజయ్‌ దేవరకొండకు టైటిల్‌ వివాదం తలెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదట ఈ టైటిల్‌ను ఎవరు రిజిస్ట్రర్‌ చేయించారు అనే విషయాన్ని బట్టి తమిళంలో విజయ్‌ దేవరకొండ టైటిల్‌ ఆధార పడి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తెలుగులో హీరోగా విడుదల చేసి ఇతర భాషల్లో వేరే టైటిల్‌తో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఉద్దేశ్యం ఉంటే ఎలాంటి సమస్య లేదు. కాని అన్ని చోట్ల ఒకే టైటిల్‌ అనుకుంటే మాత్రం ఇది విజయ్‌ దేవరకొండకు పెద్ద ఇబ్బందిగా చెప్పుకోవచ్చు.