అమెరికాలో “పాఠశాల” నూతన శాఖలు  

Usa - Patashala Starts Its New Branch In Philadelphia-

అమెరికాలో తెలుగువారి కోసం తెలుగు బాషని మాట్లాడాలని అనుకునే వారికోసం ఏర్పడినదే ‘పాఠశాల’ అమెరికాలో ఎంతో మంది తెలుగు వారు ఉంటారు అయితే వారి వారి పని ఒత్తిడుల వలన తమ పిల్లలకి తెలుగు బాషని నేర్పించుకునే పరిస్థితి ఉండదు దాంతో తెలుగు వారం అనే పేరుకే తప్ప వారి పిల్లలకి తెలుగు రాని పరిస్థితి ఏర్పడుతోంది అలాంటి వారి కోసం తెలుగుని బ్రతికించుకోవాలనే ఉద్దేశ్యంతో ఏర్పడినదే ‘పాఠశాల’.

అమెరికాలో “పాఠశాల” నూతన శాఖలు-USA - Patashala Starts Its New Branch In Philadelphia

ఈ ‘పాఠశాల’ని అమెరికాలో ఎన్నో రాష్ట్రాలో తెలుగు వారికోసం విస్తరిస్తున్నారు.అంతేకాదు అమెరికా ప్రజలు సైతం తెలుగు నేర్చుకోవడానికి ముందుకు వస్తే వారికి కూడా తెలుగు నేర్పడానికి సిద్దమని అంటున్నారు.ఈ క్రమంలోనే.కొలంబస్‌లో సెప్టెంబర్‌ 9వ తేదీన పాఠశాల కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు.

“పాఠశాల” ఏరియా డైరెక్టర్‌ కాళిప్రసాద్‌ ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది పాఠశాల చిన్నారులు, తల్లితండ్రులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అమెరికా మహిళ కూడా తెలుగుభాషను నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ పాఠశాల కేంద్రానికి సంబంధించి చేరాలన్నా లేదా మరే ఇతర సమాచారం కావాలని అనుకున్నావివరాలకు

https://paatasala.net/en/

సంప్రదించండి.