చరణ్ చేసేది అంతా డ్రామానే అంట.. ఉపాసన ఎందుకలా పోస్ట్ చేసిందో తెలుసా... చూస్తే నవ్వాపుకోలేరు.  

Upasana Comments On Ram Charan Ice Cream At Home-

అపోలో హాస్పటల్స్ గ్రూప్ కి వైస్ చైర్మన్ గా బాద్యతలు నిర్వహిస్తున్న ఉపాసన వేలమందికి బాస్ .మెగా కోడలిగా అందరి మన్ననలు పొందుతుంది..

చరణ్ చేసేది అంతా డ్రామానే అంట.. ఉపాసన ఎందుకలా పోస్ట్ చేసిందో తెలుసా... చూస్తే నవ్వాపుకోలేరు.-Upasana Comments On Ram Charan Ice Cream At Home

మొదట్లో చరణ్ కి సరిజోడిగా లేదనే నెగటివ్ టాక్ ఉన్నప్పటికీ తర్వాత తన మంచి మనసుతో మెగా కుటుంబ అభిమానాన్నే కాదు అందరి ఆదరాభిమానాల్ని పొందింది. అపోలో లైఫ్ కి ఎండీ గా అపోలో ఫౌండేషన్ కి వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు మోస్తున్నప్పటికీ భర్త రామ్ చరణ్ పనులను దగ్గరుండి చూసుకుంటోంది. ఎప్పటికప్పుడు ట్విట్టర్లో అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

ట్విట్టర్లో ఆమె పోస్టు చేసే విషయాలపట్ల మెగా అభిమాానులు ఆసక్తి కనపరుస్తుంటారు.

ఇటీవల రామ్‌చరణ్‌కు ఉత్తమ నటుడు పురస్కారం ఇచ్చేయాలంటు పోస్ట్ చేసారు ఉపాసన. సినిమాలో నటనకు కాదు… స్వీట్‌ స్వీట్‌ ఐస్‌క్రీమ్‌ తినకుండా, తిన్నట్టు డ్రామా చేసినందుకు ఉత్తమ నటుడు పురస్కారం ఇచ్చేయాలనేది ఉపాసన మాట!

రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం నుంచి అజర్‌ బైజాన్‌లో తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ మొదలైంది..

మంగళవారం కంటే ముందే చరణ్‌తో పాటు ఉపాసన ఐరోపా దేశానికి వెళ్లారు. అక్కడ భోజనం చేశాక… ఉపాసన ఐస్‌క్రీమ్‌ తిన్నారు.

ఆ ఐస్‌క్రీమ్‌పై చాక్లెట్‌ వేస్తూ చరణ్‌ సందడి చేశారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలోని ప్రేక్షకులతో పంచుకున్న ఉపాసన ‘‘రామ్‌చరణ్‌ చేసేదంతా డ్రామా! నోరూరిస్తున్న ఈ స్వీట్‌ని తను టేస్ట్‌ కూడా చేయలేదు’’ అని పేర్కొన్నారు. అంతే కాదండోయ్‌… ఆ ఐస్‌క్రీమ్‌ తిన్నందుకు రెండోరోజు ఉపాసన చేత 45 నిమిషాలు వ్యాయామం చేయించారట!!