యూపీలో 'కూటమి దెబ్బకి ' బీజేపీ 'కుదేలే'  

Upa Parties In 2019 With Congress Makes Tension In Bjp-

బీజేపీకి ప్రస్తుతం ఉన్న ఓటు బ్యాంక్ పదిలంగానే ఉంటోంది అయితే చాలా చోట్ల బీజేపీ ప్రత్యర్ధి పార్టీలు ఎన్నడూ లేని విధంగా కూటమి కట్టడంతో బీజేపీ కి కుదేలయ్యే అవకాశాలలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. సర్వేలు సైతం ఇదే మాట చెప్తున్నాయి బీజేపీ మాకు ఒకే అనుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నా బీజేపీ వ్యతిరేక పార్టీలు రెండు కలిస్తే బీజేపీ ఓటమి తప్పదని ఓ సర్వే కూడా తేల్చేసింది...

యూపీలో 'కూటమి దెబ్బకి ' బీజేపీ 'కుదేలే'-UPA Parties In 2019 With Congress Makes Tension In BJP

ఇంతకీ ఏమిటా సర్వే బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది అంటే.

గతేడాది 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అధికారం రావడంలో కీలకపాత్ర పోషించిన యూపీలో విపక్ష మహా కూటమి ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోందని తెలుస్తోంది.ప్రజల్లో మోదీ పాలనపై సానుకూలత ఉన్నప్పటికినీ “ఎస్పీ–బీఎస్పీ” గనుకా కలిసి పోటీ చేస్తే మాత్రం బీజేపీ ఇరకాటంలో పడినట్టేనని ఈ సర్వే తేల్చి చెప్పింది.ఇండియా టుడే చేపట్టిన ఈ సర్వేలో 47% మంది ప్రజలు ప్రాంతీయ పార్టీలు ఏకమైతే బీజేపీ ఇప్పుడున్న స్థానాల్లో కొన్నింటిని కోల్పోవాల్సి వస్తుందని తెలిపారట.అంతేకాదు

32% మంది కూటమి ప్రభావం బీజేపీ పై ఉంటుందని తెలిపారట అలాగే 21% మంది చెప్పలేమని పేర్కొన్నారు..

ఇండియాటుడే సంస్థ సెప్టెంబర్‌ 15–19 మధ్యలో 30,400 మంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించింది…ఈ సర్వే ప్రకారం యూపీలో 48% మంది మళ్లీ మోదీనే ప్రధానిగా కావాలని చెప్పగా 22% మంది రాహుల్‌కి ఓటు వేశారట…అలాగే 9% మంది మాయావతి ప్రధాని కావాలని అభిప్రాయపడగా. అఖిలేశ్‌కు 7% మంది ఓకే చెప్పారు.

ఇదిలాఉంటే యూపీ తదుపరి సీఎం గా యోగి ఆదిత్యనాద్ కి 43% మంది మద్దతు తెపారట అఖిలేశ్‌కు 29%, మంది ప్రజలు మద్దతు తెలుపగా మాయావతికి మాత్రం 18% మంది ఓటేశారు.యోగి పాలనపై పాలనపై 41% సంతృప్తి చెందుతుండగా. 20%మంది పర్వాలేదన్నారు…అయితే అఖిలేశ్, మాయావతిలతో పోలిస్తే. ఓబీసీలు, బ్రాహ్మణులు, ఎస్టీల్లో ఎక్కువ మంది యోగికే మద్దతు తెలిపారు…అయితే వచ్చే ఎన్నికల్లో తెలివిగా బీజేపీ పావులు కదిపి కూటమిని కోటని కొల్లగోడితే కానీ బీజేపీ బ్రతికి బట్టకట్టదు అంటున్నారు రాజకీయ పండితులు.