భారత్ పై మరోమారు విషం కక్కిన ట్రంప్  

Trump Wants To Stop Subsidies To Growing Economies Like India, China-

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటినుంచీ ట్రంప్ దృష్టంతా భారత్ నుంచీ అమెరికా వచ్చిన ఎన్నారైలపై పడింది. అమెరికాలో భారత ఎన్నారైల ఎదుగుదలని చూసి ఓర్వలేని ట్రంప్ భారతీయులని నిలువరించే క్రమంలో వీసాల జారీపై పై కీలక ఆదేశాలు జారీ చేశారు.ఆ రోజు మొదలు ఎదో ఒక రకంగా భారతీయులపై కక్ష కడుతూనే ఉన్నారు ఈ క్రమంలోనే ట్రాంప్ భారత్ పై మరో మారు తన బుద్దిని ప్రదర్శించాడు.ఇతర దేశాలకి సబ్సీడీ పై పంపే వస్తువుల విధానాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశాడు...

భారత్ పై మరోమారు విషం కక్కిన ట్రంప్ -Trump Wants To Stop Subsidies To Growing Economies Like India, China

సబ్సిడీలపై వస్తువులను భారత్, చైనా లాంటి దేశాలకు పంపుతున్నామన్నారు…మనవల్ల ఈ దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని.అమెరికా మాత్రం ఆర్థికంగా నష్టపోతోందన్నారు… ప్రపంచ వాణిజ్య సంస్థ తీరు వల్లనే చైనా ఆర్థికంగా శక్తివంతమైన దేశంగా అవతరించిందని ఉత్తర డకోటాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భారత్, చైనా తాము అభివృద్ధి చెందుతున్న దేశాలని చెప్పుకుంటున్నాయని, కాని సబ్సిడీలపై అమెరికా నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాయన్నారు…ఈ సబ్సీడీల ఖర్చుని అమెరికా భరిస్తోందని ట్రంప్ తెలిపాడు.

అమెరికా ప్రపంచంలో ఇతర దేశాల కంటే శక్తివంతమైన దేశంగా ఎదగాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని తెలిపారు…అంతేకాదు చైనా పై ఎంతో ప్రేమ ఉందని చెప్పిన ట్రంప్ మన సబ్సిడీలతో వారు సొమ్ము చేసుకుని అనుభవిస్తున్నారన్నారు.మనదగ్గర ఉన్న అత్యంత విలువైన సంపదని మనం ఇతర దేశాలని రక్షిచడానికి వెచ్చిస్తున్నామని తెలిపారు…ఆర్ధికంగా బలంగా ఉన్న దేశాలకి మనం సబ్సీడీలు ఇవ్వడం మంచిది కాదనియా తెలిపారు.