భారత్ పై సంచలన కామెంట్స్ చేసిన ట్రంప్..  

Trump Sensational Comments On Indians-

ఒక పక్క భారతీయులని అమెరికాలో ముప్పుతిప్పలు పెడుతూ వీసాల వంకతో తరిమి తరిమి కొట్టే ప్రయత్నాలు చేస్తూనే మరో పక్క డోనాల్డ్ ట్రంప్ భారత దేశంపై భారతీయులపై అపారమైన ప్రేమాభిమానాల్ని ఒలకబోస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో మాట్లాడిన ట్రంప్ ఒక్క సారిగా ఇండియాపై ప్రశంసల జల్లు కురిపించారుభారత్ వంద కోట్ల ప్రజల స్వేచ్ఛా సమాజమని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్ చేశారు.

Trump Sensational Comments On Indians-

Trump Sensational Comments On Indians

భారత్ స్వేచ్ఛా సమాజమని, లక్షల సంఖ్యలో పౌరులను పేదరికం నుంచి బయటపడవేస్తున్నదని డొనాల్ట్ ట్రంప్ తెలిపారు… ఐక్యరాజ్యసమితి 73వ సర్వసభ్య సమావేశంలో ట్రంప్ ప్రపంచ నాయకులను ఉద్దేశించి మంగళవారం ప్రసంగించారు…ఎంతో అందమైన భవిష్యత్తుకోసం పోటీ పడుతున్న దేశాలలో భారత్ కూడా ఒకటని తెలిపారు. భారత్ వంద కోట్లకు పైగా జనాభా ఉన్న స్వేచ్ఛా సమాజమని, లక్షల సంఖ్యలో పేదలను మధ్య తరగతి వర్గంగా మారుస్తున్నదని పేర్కొన్నారు. దాదాపు 35 నిమిషాలపాటు ప్రసంగించిన ట్రంప్ పలు అంతర్జాతీయ అంశాలను ప్రస్తావించారు.

Trump Sensational Comments On Indians-

అంతేకాదు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు…సదస్సు తర్వాత ఐరాసలో సుష్మా ట్రంప్‌ను పలకరించారు. ఆమెతో ట్రంప్ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా సుష్మా ప్రధాని మోదీ పంపిన సందేశాన్ని ట్రంప్ కి వివరించారు దాంతో ట్రంప్ స్పందిస్తూ ‘భారత్‌ అంటే నాకెంతో ఇష్టం. నా మిత్రుడు ప్రధాని మోదీని అడిగానని చెప్పండి’ అని అన్నారు. ఈ సమయంలో అక్కడ ట్రంప్ వెంట అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఉన్నారు.