తెలంగాణాలో కాంగ్రెస్ పనైపోయిందా ? టీఆర్ఎస్ స్కెచ్ ఇదేనా ?  

Trs Sketch For Telangana Congress-kcr,ktr,telangana Congress,telangana Politics Updates,trs,utham Kumar

తెలంగాణాలో అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ అక్కడ కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాలని చూస్తోంది. ఈ సారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చేయాలని చూస్తోంది. పార్లమెంటు ఎన్నికల ముందు నైతికంగా కాంగ్రెస్ ను దెబ్బతీయాలని ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్ని టీఆర్ఎస్ కొనసాగిస్తోంది..

తెలంగాణాలో కాంగ్రెస్ పనైపోయిందా ? టీఆర్ఎస్ స్కెచ్ ఇదేనా ? -TRS Sketch For Telangana Congress

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి వలసలను ప్రోత్సహించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కారెక్కించినందుకు చూస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు, హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి వంటి నాయకులు పార్టీలో చేరతామని ప్రకటించగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసారు. అనంతరం టీఆర్ఎస్ చేరుతున్నట్టు ప్రకటించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ముందే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోనికి చేరుతామని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్దులు సునాయాసంగా విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లాలో కీలక నేత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖాయం అయిపొయింది. ఇప్పటికే ఆమెకు మంత్రి పదవి, ఆమె కుమారుడికి ఎంపీ టికెట్ కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆ హామీతోనే వారు టీఆర్ఎస్ లోకి వచ్చేందుకు చూస్తున్నారట. ఆమె బాటలోనే టీఆర్ఎస్ లోకి మరికొంతమంది వచ్చేందుకు సిద్దపడుతున్నారని తెలుస్తోంది.కాంగ్రెస్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఈ నెల 19 న నిజామాబాద్ లో జరిగే బహిరంగ సభలో టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. అలాగే … మరోవైపు భధ్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా కారెక్కేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది.