టీఆర్ఎస్ రెండో లిస్ట్ రెడీ ! అభ్యర్థులు వీరేనా ..?  

Trs Releases Second List Of Mla Candidates-

తెలంగాణాలో కారు పార్టీ స్పీడ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇంకా విపక్ష పార్టీలు సీట్ల సర్దుబాటు వ్యవహారమే తేల్చుకోలేక కిందా మీద పడుతుంటే టీఆర్ఎస్ మాత్రం వేగం పెంచింది. మొదటి విడతగా 105 మంది పార్టీ అభ్యర్థులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచగా ఇప్పుడు రెండో విడతగా 14 మంది యాబైఆరుదులను ప్రకటించాల్సి ఉండగా ఇప్పడు 12 మంది తో ఓ జాబితా విడుదల చేసాడు. ఇక మిగిలిన రెండు స్థానాలు పాతబస్తీలో ఎంఐఎంకు బాగా పట్టున్న స్థానాలు...

టీఆర్ఎస్ రెండో లిస్ట్ రెడీ ! అభ్యర్థులు వీరేనా ..?-TRS Releases Second List Of MLA Candidates

అక్కడ అభ్యర్థులను ప్రకటించకపోవడానికి కారణం ఇంకా తెలియలేదు. అయితే ప్రస్తుత లిస్ట్ ను గురువారం అధికారికంగా విడుదల చేస్తారని తెలుస్తోంది.

టీఆర్ఎస్ ప్రకటించిన జాబితాలోని వారు వీరే.!

మల్కాజిగిరి – మైనంపల్లి హన్మంతరావు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరి, మేడ్చల్‌లో సిట్టింగ్‌లకు ఈ సారి టిక్కెట్లు ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు, ఎంపీ మల్లారెడ్డికి టికెట్ ఇస్తున్నారు. ఇక దానం నాగేందర్‌కు ఎట్టకేలకు ఖైరతాబాద్ ఖరారు చేసినట్లు సమాచారం. ఇక్కడ టికెట్ ఆశించిన విజయారెడ్డి కాంగ్రెస్ లోకి జంప్ అవుతారనే టాక్ ఉంది.

ముషీరాబాద్ టికెట్ ఆశించిన హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి కి ఈ సారి చాన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన ముఠా గోపాల్‌కే మరో సారి అవకాశం ఇవ్వొచ్చు. అంబర్‌పేట, గోషమహల్ కూడా పాతవారికి ఖాయం అయ్యిందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

వరంగల్ తూర్పు టికెట్ మేయర్ నన్నపనేని నరేందర్‌కు ఇవ్వొచ్చు. ఇక్కడ టికెట్ ఆశించిన బస్వరాజు సారయ్య విషయం ఎటూ తేల్చలేదు. చొప్పదండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొడిగె శోభకు టికెట్ ఇవ్వలేమని ఇప్పటికే తేల్చిచెప్పారు. దీంతో ఆమె కండువాలు లేకుండా ఇప్పటికే సెంటిమెంట్ ప్రచారం మొదలెట్టారు.

జహీరాబాద్ ను ఎర్రొళ్ల శ్రీనివాస్‌కు రిజర్వ్‌డ్ చేశారని టాక్. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై పోటీకి ఇద్దరు ఎన్ఆర్ఐలు పోటీ పడితే. చివరకు దూకుడు మీదున్న ఎన్ఆర్ఐ సైదిరెడ్డికి టికెట్ ఖరారు చేసినట్లు సమాచారం...