స్పీడ్ పెంచిన కారు .... కాంగ్రెస్ పరిస్థితి ఏంటి.  

  • ముందస్తు ఎన్నికలపై ముందు నుంచి కంగారు పడుతున్న కేసీఆర్ ఎట్టకేలకు తాను అనుకున్నది మాత్రం చేయగలిగాడు. ఎన్నికల్లో గెలుపు తమకే అన్న ధీమాలో ఉన్న కేసీఆర్ ఆ మేరకు ప్రణాళికలు వేసుకుని పక్కగా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల సమరానికి సై అన్నాడు. ప్రస్తుతం తెలంగాణాలో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పుంజుకుంటోంది. ఇక మిగతా పార్టీల పరిస్థితి అంతంతమాత్రమే. ఇదే కేసీఆర్ ముందస్తు తొందరకు మరో కారణం. సాధారణ ఎన్నికల వరకు వేచి చూస్తే తమ ప్రత్యర్థి పార్టీలు బలపడడంతో పాటు ప్రజల్లో ప్రభిత్వ వ్యతిరేకత పెరిగి తమ గెలుపు అవకాశాలు సన్నగిల్లుతాయని భావించి ఈ విధంగా చేసాడు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న దూకుడు ఇలాగే ఎన్నికలవరకు కొనసాగిస్తే తమ ప్రత్యర్థి పార్టీలు వెనకబడిపోయితాయని తమ గెలుపు సులువు అవుతుందని కేసీఆర్ ఆలోచన.

  • TRS Car Gets Speed Up But What About Congress-

    TRS Car Gets Speed Up But What About Congress

  • కేసీఆర్ నిర్ణయాలు అంత తొందరగా ఎవరికీ అర్ధం కావు. అవి తొందరపాటు నిర్ణయాలుగా అందరికి కనిపించినా వాటి వెనుక మాత్రం బలమైన ప్రయోజనం మాత్రం దాగి ఉంటుంది. ఎంత తొందరగా అయితే అసెంబ్లీని రద్దు చేసాడో అంతే తొందరగా అభ్యర్థుల లిస్ట్ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు.105 స్థానాలకు అభ్యర్థులను అసెంబ్లీ రద్దయిన మరుక్షణమే ప్రకటించడం ప్రత్యర్థి పార్టీలకు మింగుడుపడడంలేదు. ఈ పరిణామం కాంగ్రెస్ లో కంగారు పుట్టించింది. తాము వెనుకబడలేదని చెప్పుకునేందుకు తాపత్రయపడింది. అప్పటికప్పుడు 60 మంది అభ్యర్థులతో ఒక జాబితాను సిద్ధం చేసుకున్నట్టు ప్రకటించుకుంది.

  • TRS Car Gets Speed Up But What About Congress-
  • కాంగ్రెస్ ఇప్పుడు 60 మందితో జాబితాను సిద్ధం చేసినా మిగిలిన స్థానాల్లో అభ్యర్థులపైనే అసలైన కసరత్తు జరగాల్సి ఉంటుంది. టీఆర్‌ఎస్ మాత్రం 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ముందస్తు కసరత్తు ఎంత ముందుగా జరిగిందో చాటుకున్నారు.ఒకేసారి టికెట్లను ప్రకటించడం ద్వారా పార్టీలో తన నిర్ణయానికి తిరుగులేదని కూడా కేసీఆర్‌ చాటుకునే ప్రయత్నం చేశారు. దాదాపు 30 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌లపై ప్రజా వ్యతిరేకత ఉందని భావిస్తున్నా సరే దాదాపు సిట్టింగ్‌లందరికీ టికెట్‌ ఇవ్వడం ద్వారా జనం తన పాలన చూసే ఓటేస్తారన్న భావనతో కేసీఆర్‌ ఉన్నట్టు కనిపిస్తోంది. కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసి టికెట్లను ప్రకటించేసినా ఎక్కడా పెద్దగా అభ్యంతరాలు రాలేదు. కానీ కాంగ్రెస్ లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగానే ఉంది. పోటీ ఉన్న సీట్లలో అభ్యర్థులను ప్రకటించినప్పుడు రచ్చ ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ లో ఎవరికి వారే తామే గొప్ప అన్నట్టుగా ఉంటారు. దీనికి తోడు గ్రూపు రాజకీయాలు ఆ పార్టీకి పెద్ద మైనెస్ గా కనిపిస్తోంది.