అప్పుడు వెంకీ స్టోరీ పవన్‌కు... ఇప్పుడు పవన్‌ స్టోరీ వెంకీకి  

Trivikram Story Shifted From Pawan Kalyan To Hero Venky-

Trivikram Srinivas is currently working on NTR's film 'Aravindasametha'. The film is going to come up as Dasara gift. As soon as the film is completed, Trivikram will get his next film Venkatesh as hero. Over the years, the news about these combinations comes in film circles. Their combo is currently being arranged. A good script has already been reported that Venky is also ready for Trivikram.

.

Trivikram Story wanted to do a film with Pawan Kalyan after 'Agnatevasi'. Pawan was busy with politics. There is no way allocating time for movies. So, Pawan decided to do the story with Venkatesh. Negotiations about it have also happened. Venkatesh gives the green signal to the story, saying the film is likely to be rolled out soon. . Earlier, Trivikram's 'Attarintiki Dharedhi' story was first heard by Venkatesh. But Venky seems to have said no to the film because of the commitments and other reasons. Pawan Kalyan went to Aartarinti Daredi. It does not specifically say how big it is. Now Pawan's upcoming Story comes to Venky. .

. There are close links between Pawan and Venkis. That is why Pawan has said that he is going to do well with Venkiki. That's why Trivikram seems to have made the latest film arrangements. Venkatesh is currently doing a multi starrer with 'F2' along with Nagachaitanya. The two pictures are full, but the trivikram should be given dates. .

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘అరవిందసమేత’ చిత్రం చేస్తున్న విషయం తెల్సిందే. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అరవింద సమేత చిత్రం పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్‌ తన తదుపరి చిత్రాన్ని వెంకటేష్‌ హీరోగా చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది...

అప్పుడు వెంకీ స్టోరీ పవన్‌కు... ఇప్పుడు పవన్‌ స్టోరీ వెంకీకి-Trivikram Story Shifted From Pawan Kalyan To Hero Venky

చాలా సంవత్సరాలుగా వీరిద్దరి కాంబినేషన్‌ గురించిన వార్తలు ఫిల్మ్‌ సర్కిల్స్‌లో వస్తున్నాయి. ప్రస్తుతం వీరి కాంబోకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక మంచి స్క్రిప్ట్‌ను ఇప్పటికే వెంకీ కూడా త్రివిక్రమ్‌ రెడీ చేశాడు అంటూ సమాచారం అందుతుంది.

‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత పవన్‌ కళ్యాణ్‌తో ఒక చిత్రాన్ని చేయాలని త్రివిక్రమ్‌ స్టోరీ అనుకున్నాడు. అయితే పవన్‌ వరుసగా రాజకీయాలతో బిజీ అయ్యాడు. సినిమాలకు సమయం కేటాయించే పరిస్థితి లేదు. దాంతో పవన్‌కు అనుకున్న స్టోరీని వెంకటేష్‌తో చేయాలని నిర్ణయించుకున్నారు.

అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగిపోయాయి. వెంకటేష్‌ కథకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. .

గతంలో త్రివిక్రమ్‌ ‘అత్తారింటికి దారేది’ చిత్రం కథను మొదట వెంకటేష్‌కు వినిపించాడట.

కాని వెంకీ అప్పుడు ఉన్న కమిట్‌మెంట్స్‌ మరియు ఇతరత్ర కారణాల వల్ల ఆ చిత్రానికి నో చెప్పాడని తెలుస్తోంది. దాంతో అత్తారికింటికి దారేది చిత్రం పవన్‌ కళ్యాణ్‌కు వెళ్లింది. అది ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పుడు పవన్‌ కోసం అనుకున్న స్టోరీ వెంకీ వద్దకు వచ్చింది.

పవన్‌, వెంకీల మద్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ కారణంగానే తనకోసం చేసిన కథ వెంకీకి అయితే బాగా నప్పుతుందని స్వయంగా పవన్‌ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ కారణంగానే త్రివిక్రమ్‌ తాజాగా చిత్రంకు సంబంధించిన ఏర్పాట్లు షురూ చేసినట్లుగా తెలుస్తోంది.

వెంకటేష్‌ ప్రస్తుతం ‘ఎఫ్‌ 2’తో పాటు నాగచైతన్యతో ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ రెండు చిత్రాలు పూర్తి అయితే త్రివిక్రమ్‌కు డేట్లు ఇస్తాడేమో చూడాలి.