అతడు గర్బం దాల్చి అమ్మ అయ్యాడు... డాక్టర్లు సాధ్యం కాదని చెప్పినా ట్రాన్స్‌జెండర్‌ కల ఫలించింది  

Transgender Man Gives Birth To Baby Boy-pregnancy,transgender

ఈమద్య కాలంలో ట్రాన్స్‌ జెండర్‌ల సంఖ్య మరీ ఎక్కువ అవుతుంది. అమెరికా వంటి అభివృద్ది చెందిన దేశాల్లో ట్రాన్స్‌ జెండర్‌లు అంతకంతకు పెరిగి పోతున్నారు. ముఖ్యంగా మగవారు ఆడవారిగా ఎక్కువగా మారుతున్నారు. ట్రాన్స్‌ జెండర్‌లను తేడ, మాడా అని అంటారు. పూర్తిగా ఆడవారిగా మారిపోయినా కూడా తమను ఎందుకు తేడా అంటారని ట్రాన్స్‌ జెండర్‌లు ఆవేదన వ్యక్తం చేయడం మనం చూశాం. ఎంతగా పూర్తి ఆడవారిగా మారినా కూడా గర్బం దాల్చడం అనేది ట్రాన్స్‌ జెండర్స్‌కు సాధ్యం అయ్యే పని కాదు. అందుకే వారు తేడాగా మిగిలి పోతున్నారు. అయితే మొట్టమొదటిసారి ట్రాన్స్‌ జెండర్‌ గర్బం దాల్చడం చర్చనీయాంశం అవుతోంది.

28 ఏళ్ల విల్లే సిమన్స్‌ అనే ట్రాన్స్‌ జెండర్‌ ఏడు సంవత్సరాల క్రితం లింగమార్పిడి చేయించుకుని తన బాయ్‌ ఫ్రెండ్‌తో సహజీవనం సాగిస్తున్నాడు. ట్రాన్స్‌ జెండర్‌ అయిన విల్లేను అంతా కూడా ఎగతాలి చేసేవారు. ఆ టైప్‌ అంటూ ఏడిపించేవారట. తాను పూర్తిగా అమ్మాయిని అంటూ చెప్పేందుకు ప్రయత్నించానని, కాని వారు నన్ను ఎగతాలి చేస్తూనే వచ్చారని విల్లే ఆవేదన వ్యక్తం చేశాడు. వారి నోళ్లు మూయించాలి అంటే నేను గర్బం దాల్చాలని భావించాను. అందుకు వైధ్యుల వద్దకు వెళ్లాను. కాని ట్రాన్స్‌ జెండర్స్‌ గర్బం దాల్చడం సాధ్యం అయ్యే పని కాదని, అది పూర్తిగా ఆడవారికి మాత్రమే సాధ్యం అంటూ డాక్టర్లు విల్లే ఆశలపై నీళ్లు జల్లారు.

Transgender Man Gives Birth To Baby Boy-Pregnancy

Transgender Man Gives Birth To Baby Boy

పిల్లల కోసం ఆరాటపడుతున్న విల్లే కోరిక నెరవేరింది. అనూహ్యంగా ప్రతి నెల వచ్చే నెలసరి రాకపోవడంతో విల్లే తన బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి వైధ్యులను సంప్రదించగా, ఆశ్చర్యకరంగా తను గర్బవతి అని వైధ్యులు నిర్థారించారు. గర్బం దాల్చిన తర్వాత పెద్ద కడుపుతో రోడ్డు పై నడుస్తుంటే అంతా కూడా నన్ను చూసి నవ్వడంతో పాటు, కొందరు ఆశ్చర్యపోయేవారు. నేను వారందరికి తానో పూర్తి మహిళను అని చెప్పాలని అనుకున్నట్లే జరిగిందని విల్లే చెప్పుకొచ్చాడు.

Transgender Man Gives Birth To Baby Boy-Pregnancy

2018 సెప్టెంబర్‌లో విల్లే పండంటి బాబుకు జన్మనిచ్చాడు. డెలవరీ సమయంలో కాస్త ఇబ్బంది అయినా కూడా అన్ని రకాలుగా మంచి జరిగిందని విల్లే చెబుతున్నాడు. ప్రపంచంలోనే తమ బాబు అత్యంత అరుదైన బాబు అని, వాడికి కావాల్సిన పూర్తి స్వేచ్చను, సంతోషాన్ని తాము ఇస్తామని విల్లే మరియు అతడి బాయ్‌ ఫ్రెండ్‌ చెబుతున్నారు. విల్లేను ఆదర్శంగా తీసుకుని మరెంత మంది ట్రాన్స్‌ జెండర్‌లు గర్బందాల్చేందుకు ప్రయత్నిస్తారో చూడాలి.