మన హీరోల్లో అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకునేది ఎవరో తెలుసా.? టాప్ 10 లిస్ట్ ఇదే.!  

 • మ‌న దేశంలో ఉన్న అనేక భాష‌ల‌కు గాను వాటికి చెందిన ఫిలిం ఇండ‌స్ట్రీలు కూడా ఉన్నాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా వాటిల్లో బాలీవుడ్ ఫిలిం ఇండ‌స్ట్రీ చాలా పెద్దది. ఇక ఆ త‌రువాత స్థానంలో చెప్పుకోవాలంటే మ‌న తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకే ఆ స్థానం ద‌క్కుతుంది. ఒక‌ప్పుడేమో గానీ ఇప్పుడు టాలీవుడ్ స్థాయి చాలా రెట్లు పెరిగింది. ఆ కోవ‌లోనే మ‌న ఇండ‌స్ట్రీకి చెందిన అగ్ర హీరోల రెమ్యున‌రేష‌న్ కూడా పెరుగుతూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ ఏడాది అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న టాప్ తెలుగు అగ్ర హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందామా!

 • 1. మహేష్ బాబు

 • టాలీవుడ్ లో ప్ర‌స్తుతం అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్నది మ‌హేష్ బాబే. భారత్ అనే నేను సినిమాకు మ‌హేష్ రూ.20 కోట్లు తీసుకున్నాడ‌ట‌. దీంతోపాటు లాభాల్లో 50 శాతం వాటా కూడా తీసుకున్న‌ట్టు తెలిసింది. గతంలో వ‌చ్చిన బ్ర‌హ్మోత్స‌వం, స్పైడర్ లు డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డంతో మ‌హేష్ త‌న పారితోషికం తిరిగిచ్చిన‌ట్టు స‌మాచారం. ఇక త్వరలో రానున్న మహర్షికి ఎంత తీసుకుంటారో.

 • Top 10 Highest Paid Actors In Tollywood-

  Top 10 Highest Paid Actors In Tollywood

 • 2. ప‌వ‌న్ క‌ల్యాణ్

 • ప‌వ‌న్ ఒక్క సినిమాకు తీసుకుంటున్న పారితోషికం రూ.22 కోట్లు. గ‌తంలో విడుదలైన కాట‌మ‌రాయుడుకు ప‌వ‌న్ ఇంత మొత్తంలో తీసుకున్న‌ట్టు తెలిసింది. కానీ ఆజ్ఞ్యతవాసి సమయంలో మాత్రం అంతగా కలెక్షన్స్ రాకపోవడంతో తిరిగి ఇచ్చేసినట్టు సమాచారం.

 • Top 10 Highest Paid Actors In Tollywood-
 • 3. ఎన్టీఆర్

 • వైవిధ్య‌భ‌రిత‌మైన సినిమాలు చేస్తూ స్టైలిష్ లుక్‌లో అభిమానుల‌కు క‌నువిందు చేస్తున్న ఎన్‌టీఆర్ కూడా ఒక్క సినిమాకు రూ.22 కోట్ల వ‌ర‌కు పారితోషికం తీసుకుంటున్నాడ‌ట‌.

 • Top 10 Highest Paid Actors In Tollywood-
 • 4. రాంచ‌ర‌ణ్ తేజ

 • రాంచ‌ర‌ణ్ తేజ ఒక్క సినిమాకు తీసుకుంటున్న పారితోషికం రూ.18 కోట్లు అని తెలిసింది.

 • Top 10 Highest Paid Actors In Tollywood-
 • 5. ప్ర‌భాస్

 • బాహుబ‌లి రెండు పార్ట్‌లలో ఒక్కోదానికి రూ.25 కోట్ల వ‌ర‌కు పారితోషికం తీసుకున్నాడ‌ట ప్ర‌భాస్‌. అయితే బాహుబ‌లి త‌రువాత చేస్తున్న సినిమాల‌కు ఒక్కోదానికి రూ.15 కోట్లు మాత్ర‌మే తీసుకుంటున్న‌ట్టు తెలిసింది.

 • Top 10 Highest Paid Actors In Tollywood-
 • 6. అల్లు అర్జున్‌

 • స్టైలిష్ స్టార్ అర్జున్ కూడా మంచి క్రేజ్ సంపాదించడంతో రేట్ బాగా పెంచేసాడు అంట. అల్లు అర్జున్ ఒక్క సినిమాకు రూ.15 కోట్ల వ‌ర‌కు పారితోషికం తీసుకుంటున్నాడ‌ట‌.

 • Top 10 Highest Paid Actors In Tollywood-
 • 7. ర‌వితేజ

 • వ‌రుస ఫ్లాప్‌ల‌తో క‌ష్ట‌కాలం ఎదుర్కొంటున్నాడు ర‌వితేజ. ఇత‌ను ఒక్క సినిమాకు రూ.10 కోట్ల వ‌ర‌కు తీసుకుంటున్నాడ‌ని టాక్‌.

 • Top 10 Highest Paid Actors In Tollywood-
 • 8. బాల‌కృష్ణ

 • పైసా వసూల్, జయసింహ సినిమాలకు 9 కోట్ల పారితోషికం తీసుకున్నాడంట మన బాలయ్య. ఇక ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో పారితోషికం ప్రశక్తే ఉండదు కదా. ఎందుకంటే సినిమా నిర్మాత నందమూరి ఫామిలీ నే.

 • Top 10 Highest Paid Actors In Tollywood-
 • 9. వెంక‌టేష్

 • తన వయసుకి తగ్గ పత్రాలు సెలెక్ట్ చేసుకొని మంచి హిట్స్ అందుకోవడమే కాదు ఆడియన్స్ ప్రశంసలు అందుకుంటున్నారు విక్టరీ వెంకటేష్. ఆయన ఒక సినిమాకు రూ.8 కోట్ల వ‌ర‌కు తీసుకుంటాడ‌ని తెలిసింది.

 • Top 10 Highest Paid Actors In Tollywood-
 • 10 . నాగార్జున

 • కింగ్ నాగార్జున ఒకో సినిమాకు 7 కోట్లు తీసుకుంటారంట.

 • Top 10 Highest Paid Actors In Tollywood-