కేరళ వరద బాధితులకు సహాయం చేసిన చేపలమ్మాయి గుర్తుందా... ఇప్పుడు ఆమె పరిస్థితి విషమం... ఏమైంది.  

  • హసన్ అమీద్ గుర్తుందాచేపలు అమ్ముకుని వచ్చిన డబ్బుతో చదువుకుంటున్న అమ్మాయి గత నెల సోషల్ మీడియా లో వైరలైన అమ్మాయిగుర్తింపుకోసమే ఇదంతా చేస్తుందంటూ కొందరు ఆకతాయిలు అమ్మాయిని సోషల్ మీడియాలో అల్లరిపాలు చేసారు.ఆ అమ్మాయి నిజంగానే చేపలు అమ్ముతుందా అంటూ కొందరు తనుంటున్న ప్లేస్ కి వెళ్లి వాకబు చేశారు…దాంతో ఆ అమ్మాయి చేతులెత్తి మరీ వేడుకుంది నన్నొదిలేయండంటూఅదంతా ఒకవైపు…కానీ పేదరికం వెంటాడుతున్నా వరద బాధితుల సాయం కోసం ముందుకు రావడం మరొకవైపు.

  • This Kerala Fishing Girl Hanan Hamid Is Fighting For Her Life-

    This Kerala Fishing Girl Hanan Hamid Is Fighting For Her Life

  • హనన్ ఫొటోలు వైరల్ కావడంతో చాలామంది సాయం చేయడానికి ముందుకొచ్చారు. మాలీవుడ్ నటులు కూడా స్పందించి సినిమా అవకాశాలను ఇవ్వడానికి ముందుకొచ్చారు. హనన్ విద్యభ్యాసానికి ఆర్థికసాయం చేశారు.అప్పట్లో కేరళ సిఎం పినరయ్ విజయన్ కూడా ఆమెకు సాయం చేస్తామని మాట ఇచ్చారు అయితే ప్రస్తుత వరదలు హనన్ ను కదిలించడంతో తనకి వచ్చిన ఆర్థిక సాయం మొత్తాన్ని కేరళ బాధితుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించి తన ఔదార్యాన్ని చాటుకుంది

  • This Kerala Fishing Girl Hanan Hamid Is Fighting For Her Life-
  • కానీ దురదృష్టపుశాత్తు సంచలనంగా మారిన ఈ అమ్మాయి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది. సోమవారం (సెప్టెంబర్ 3) ఉదయం ఓ స్టేజీ షోకు వెళ్లి తిరిగొస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హనన్ తీవ్రంగా గాయపడింది. తీవ్ర రక్తస్రావమైంది. వెన్నెముకకు తీవ్రమైన దెబ్బ తగలడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కొడంగళూర్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ హనన్‌ను వెంటనే కొడంగళూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కొచ్చిలోని ఆస్పత్రికి తరలించారు.