టికెట్ దొరికినా ... మనీ ఇక్కట్లు తప్పడంలేదు !  

The Trs Faces Financial Problems For Election Campaigning-

The state of Andhra Pradesh has been witnessing the entire environment of the state. Wherever the sight of the mice are changing ... propagating vehicles are going to shake up in the hood. TRS party announce candidates in advance .. The name of the list is a pleasure to the candidates ... the other side of the concern is also anxiety. The cost of the campaign is scary. There is a two-month period for the elections and the tribes are going to burden the burden. On the one hand, it is going to be a massive campaign, but on the other hand, it is a huge cost.

.

In fact, the election schedule will be announced in late October and will be held in November. But the Election Commission has dipped water for those hopes. Unexpectedly announcing the dates change. Elections will be held in December. There are two more months for the election. The election campaign is not an ashram affair. The daily cost will be Rs. Meals, drugs and money have to be sold. In this calculation, the promotional cost of the two months will go to the quotes. There is no need to raise funds for this.

. On the other hand, the announcement of the alliance's candidates has not yet come up. The Congress leaders are expressing their frustration over the Election Commission's announcement, given the election time. Congress, TDP, TJS and CPI parties have some advantages over expenditure. The seat adjustment in the great fraternity seems to be delayed as it does not yet come to a collision. Compared to the parties in this calculation, the TRS candidates seem to be dazzling. .

..

..

..

తెలంగాణ ఎన్నికల పుణ్యమా అని రాష్ట్రమంతా పండగా వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా మైకులు మారుమోగుతున్నాయి… రయ్యి రయ్యిమని ప్రచార వాహనాలు సందు గొందుల్లో తిరుగుతూ సందడి సందడి చేస్తున్నాయి. ఇక టీఆర్ఎస్ పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం . ఆ లిస్ట్ లో తమ పేరు ఉండడం అభ్యర్థులకు ఆనందం కలిగిస్తున్నా… మరో వైపు ఆందోళన కూడా వెంటాడుతోంది. టికెట్ దొరికినా ప్రచార ఖర్చు భయపెట్టేస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో అంత భారాన్ని మోసేదెలా అంటూ తెగ మదనపడిపోతున్నారు. ఒకవైపు భారీగా ప్రచారం నిర్వహిస్తూనే, మరోవైపు భారీ ఎత్తున ఖర్చు మీద పడుతోందని లబోదిబోమంటున్నారు...

టికెట్ దొరికినా ... మనీ ఇక్కట్లు తప్పడంలేదు ! -The TRS Faces Financial Problems For Election Campaigning

వాస్తవంగా అక్టోబరు చివరిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వస్తుందని, నవంబరులో ఎన్నికలు జరుగుతాయని భావించారు. కానీ, ఆ ఆశలకు ఎన్నికల కమిషన్ నీళ్లు చల్లింది. అనూహ్యంగా తేదీలను మార్పు చేస్తూ ప్రకటన చేసింది. డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయని అంది.

దాంతో ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది.

భోజనాలు, మందు, డబ్బు పంపకం తప్పనిసరిగా మారింది. ఈ లెక్కన చూసుకుంటే రెండు నెలలకు అయ్యే ప్రచార ఖర్చు కోట్లకు చేరుతుంది. ఆ మేరకు నిధులను సేకరించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

మరోవైపు మహా కూటమి అభ్యర్థుల ప్రకటన ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎన్నికలకు బాగా సమయం ఇవ్వడంతో ఎన్నికల కమిషన్ ప్రకటనపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలకు ఖర్చుల విషయంలో కొంత వెసులుబాటు లభించింది. మహా కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో మరికొంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

ఈ లెక్కన కూటమిలోని పార్టీలతో పోల్చుకుంటే … టీఆర్ఎస్ అభ్యర్థుల ఖర్చు తడిపి మోపెడు అయ్యేలా కనిపిస్తోంది.