ఒకప్పుడు గాజులమ్మిన వ్యక్తి ఇప్పుడు ఐఏఎస్ అయ్యాడు..పేదరికం,అంగవైకల్యం చదువుకి అడ్డు కాదని నిరూపించాడు.  

The Story Of A Disabled Bangle Seller Who Is Now An Ias Officer-

Nasti's dysfunction with the work is that the elders can achieve anything if poverty and disability are not barriers to studying, IAS ..

.

. With the help of family, he was ready to work with the guidance of teachers. Without coaching, IAS managed to overcome difficulties. Ramesh is currently working as Joint Secretary in the Jharkhand Energy Department. Provides the necessary skills for the students who are prone to the civil disobedience .. Once the glass sold by the boy came to the IAS cadre to overcome the poverty and polio woes. He is inspired by many youths to prepare for civils.

కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు.కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు..

ఒకప్పుడు గాజులమ్మిన వ్యక్తి ఇప్పుడు ఐఏఎస్ అయ్యాడు..పేదరికం,అంగవైకల్యం చదువుకి అడ్డు కాదని నిరూపించాడు.-The Story Of A Disabled Bangle Seller Who Is Now An IAS Officer

పేదరికం,అంగవైకల్యం ఇవేవి చదువుకోవడానికి అడ్డంకులు కాదని.చదువుకోవాలనే తపన ఉంటే ఎన్ని కష్టాలనైనా అధిగమించొచ్చని నిరూపించాడు.తాను ఉన్నతంగా ఎదగడమే కాదు,తనలాంటి ఎందరో పేద విద్యార్ధులకు చేయూతనందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

అతడే రమేశ్ ఘోలావ్, ఐఎఎస్ .

రమేశ్ ఘోలప్ మహారాష్ర్ట లోని సోలాపూర్ జిల్లా బర్షీ తాలుకాలోని మహాగోగన్ గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు విమల ఘోలావ్,గోరఖ్ ఘోలవ్.రమేశ్ తండ్రి గోరఖ్ ఘోలప్ సైకిల్ రిపేర్ షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు.

అయితే తాగుడుకు బానిసైన గోరఖ్ రమేశ్ చిన్న తనంలోనే చనిపోయాడు.తండ్రి మరణంతో కుటుంబ బాధ్యతలు తల్లి విమల్ ఘోలప్ తీసుకుంది. సొంతూరులోనే గాజుల షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చేది..

చిన్న వయస్సులోనే పొలియో బారిన పడిన రమేశ్,తన అన్నఇద్దరు కలిసి గాజులు అమ్మడంలో తల్లికి సాయం చేసేవారు.పోలీయో అయినప్పటికీ ఏమాత్రం బాదపడకుండా ఉండేవాడు రమేశ్.

అంతేకాదు చదువులోనూ చురుకుగా ఉండేవాడు. మహాగగోన్ గ్రామంలో ఒకే ఒక్క ప్రైమరీ పాఠశాల ఉండేది.మేనమామ సహకారంతో ఆ పాఠశాలలో జాయిన్ అయ్యాడు.పేదరికాన్ని జయించాలంటే కేవలం చదువొక్కటే ఆయుదమనే విషయాన్ని పూర్తిగా నమ్మేవాడు రమేశ్.

ఎప్పటికైనా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో రమేశ్ కష్టపడి చదవడం మొదలు పెట్టాడు. పేదరికం వెంటాడుతున్నా… బ్రిలియంట్ స్టూడెంట్ గా గుర్తింపు పొందాడు.

88 శాతం మార్కులతో ఫైనల్ ఎగ్జామ్ లో పాసయ్యాడు. ఆ తర్వాత టీచర్ గా పనిచేశాడు. తండ్రి మరణంతో తల్లికి వచ్చే ప్రభుత్వ పింఛన్ రాకపోవడం… బాధ్యతయుతంగా పనిచేయాల్సిన అధికారులు సక్రమంగా పనిచేయకపోవడం… రమేశ్ ను ఎంతగానో బాధించాయి. తానో ప్రభుత్వ అధికారి అయితైనే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని భావించాడు.

కుటుంబ సహకారంతో. టీచర్ల గైడెన్స్ తో సివిల్స్ కు సిద్ధమయ్యాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా… కష్టాలను అధిగమించి ఐఏఎస్ సాధించాడు.

ప్రస్తుతం జార్ఖండ్. ఎనర్జీ డిపార్ట్ మెంట్ లో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న రమేశ్ తనలాంటి ఎంతోమంది విద్యార్థులకు అండగా నిలుస్తున్నాడు..

సివిల్స్ ప్రిపరయ్యే విద్యార్థుల కోసం అవసరమైన స్కిల్స్ అందిస్తున్నాడు. ఒకప్పుడు గాజులు అమ్మిన అబ్బాయి.

పేదరికాన్ని, పోలియో బాధలను జయించి. ఐఏఎస్ క్యాడర్ స్థాయికి ఎదిగాడు. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది యువత సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు.