'హ్యాపీ బర్త్ డే టూ యూ..' పాట ఎలా వచ్చింది?ఎప్పుడు వచ్చింది?ఈ పాట ఎవరు రాసారు?ఆసక్తికరమైన విషయాలు మీకోసం..  

The Story Behind The Happy Birthday -

హ్యాపీ బర్త్ డే టూ యూ…హ్యాపీ బర్త్ డే టూయూ…ఈ పాట తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదుచిన్నపిల్లల దగ్గర నుండి పండు ముసలి వారి వరకు ఎవరిని కదిపినా ఆటోమేటిక్ గా పెదాలపైన ఈ పాట వచ్చేస్తుంటుంది ఒక్కసారి ఈ పాటని గుర్తు చేస్తే చాలు చిన్నపిల్లలు యమాహుషారుగా రిధమిక్ గా పాడేస్తుంటారుముఖాల్లో నవ్వులతోఅసలు ఈ పాట ఎలా వచ్చిందిఎవరు రాసారు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీకోసం

The Story Behind Happy Birthday Song-

The Story Behind The Happy Birthday Song

ఈ పాట ఎప్పుడు మొదలైంది అంటే నిన్నా మొన్నటిది కాదుహ్యాపీ బర్త్ డే పాట వయసు వందేళ్లకు పైనే అంటే 1893లో రాసారు ఈ పాటని గుడ్ మార్నింగ్ టు ఆల్ అనే పాట నుంచి వచ్చింది ఈ హ్యాపీ బర్త్ డే పాట ఆ సంవత్సరంలోనే మొదటిసారి ఆ పాటని అమెరికా స్కూల్ లో పాడారు. చిన్నారులకి ఈజీగా ఉండేలా చేసే ప్రాసెస్ లో గుడ్ మార్నింగ్ టు ఆల్ అనే మాటల్ని పాటగా మార్చారు. దాని తర్వాత గుడ్ మార్నింగ్ నుంచి హ్యాపీ బర్త్ డేకి మారింది సాంగ్…గిన్నిస్ బుక్కు లెక్క ప్రకారం ఇంగ్లీష్ భాషలోని అన్ని పాటల్లో కంటే హ్యాపీ బర్త్ డే సాంగే ఫేమస్. ఇప్పటివరకు దీన్ని ఢీ కొట్టిన పాటే లేదు అంటే ఎంత ఫేమస్సో అర్దం చేస్కోండి

The Story Behind Happy Birthday Song-

ఇక్కడ ఇంకోఆసక్తికరమైన విషయం చెప్పాలి…అందరికి సుపరిచితమైన ఈ పాటని ఇప్పటివరకు చాలా సినిమాల్లో కూడా మనం చూసాంఅయితే ఈ పాటపై మాకే కాపీ రైట్ ఉందంటూ వార్నర్ మ్యూజిక్ సంస్థ కోర్టుకెళ్లింది. ఓ మూవీ ప్రొడ్యూసర్ కీ వార్నర్ మ్యూజిక్ సంస్థకీ మధ్య రెండేళ్లు ఫైట్ నడిచింది. ఆ మూవీలో హ్యాపీ బర్త్ డే పాట వాడాలంటే తమకి డబ్బివ్వాల్సిందే అని డిమాండ్ చేసింది వార్నర్ సంస్థ. అయితే వార్నర్ చాపెల్ మ్యూజిక్ కి కాపీ రైట్స్ లేవంటూ తీర్పు ఫైనల్ చేసింది ఫెడరల్ కోర్టు…అంతేకాదు హ్యాపీ బర్త్ డే పాటను అందరూ పాడుకోవచ్చని తీర్పు ఇచ్చిందిLet’s Sing…