లాటరీ టికెట్ కొని పక్కన పడేశాడు ! పది నెలల తరువాత షాక్ అయ్యాడు..!  

The Ticket Picked Up! What Has Been Won After Ten Months-

ఒక్కొక్కసారి మనం అశ్రద్ధ చేసి వదిలేసినవే మనకు కలిసొస్తుంటాయి. అందుకే దేన్నీ తేలిగ్గా తీసిపారేయ్యకూడదు అంటారు. కానీ కెనడాకు చెందిన ఓ వ్యక్తి ఇలాగే అశ్రద్ధ చేసి పక్కన పడేసిన ఒక లాటరీ టికెట్ అతనికి కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టింది. అది చూసి అతడు షాక్ అయ్యాడు. అసలు ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు ఇది నిజమేనా అంటూ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. ఇంతకీ విషయం ఏంటంటే? కెనడాలోని మాంట్రియల్ ప్రాంతంలో నివాసముంటున్నాడు గ్రెగోరియో డి సాంటిస్. ఎప్పుడో పది నెలల క్రితం ఓ లాటరీ టికెట్ కొన్నాడు. ఆ ఏం తగులుతుందిలే అని దాన్ని ఎక్కడో పడేసాడు.

The Lottery Ticket Picked Up! What Has Been Won After Ten Months-

The Lottery Ticket Picked Up! What Has Been Won After Ten Months

కానీ సోదరి ఆ టికెట్ గురించి ఆరాతీయగా… అప్పుడు లాటరీ టికెట్ కొన్న విషయం గుర్తొచ్చి పాత బట్టలు వెతగ్గా ఓ కోటు లో అది దొరికిందట. ఆ టికెట్ తీసుకొని తన ఉందో లేదో అని పరిశీలించగా ఏకంగా 17 లక్షల డాలర్ల(దాదాపు రూ.10 కోట్లు) లాటరీ తగిలినిట్టు తెలుసుకుని ఒక్కసారిగా షాకయ్యాడు. తన సోదరి చెప్పకపోతే కనీసం లాటరీ గురించి పట్టించుకోకపోయే వాడినని, అంత మొత్తం గెలుచుకున్నానని తెలిసిన వెంటనే ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయిందని తెగ సంబరపడిపోయాడు గ్రెగోరియో. గెలిచిన మొత్తాన్ని తన రిటైర్మెంట్ ఎకౌంట్‌ వృద్ధికి ఉపయోగిస్తానని గ్రెగోరియో చెప్పాడు. 1970ల నుంచి లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తున్న గ్రెగోరియో 2000 సంవత్సరంలో రెండు లక్షలు గెలుపొందాడు.