తిండి లేక చేతిలో డబ్బు లేక..పార్కుల్లోనే..ప్రవాస కార్మికుల గాధ  

Telugu Nri People Living At Parks In Uae-

యూఏఈ లో తెలుగు రాష్ట్రాలకి చెందిన యువకులు ఎంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. యూఏఈ ప్రవేశ పెట్టిన ఆమ్నెస్టీ క్షమాబిక్ష ఉన్నా సరే ఉపయోగించుకోలేని దీన స్థితిలో నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, వరంగల్‌, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 33 మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు వారి జేబులో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో ఏమి చేయాలో తెలియక ఇంటికి వెళ్ళలేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే..

తిండి లేక చేతిలో డబ్బు లేక..పార్కుల్లోనే..ప్రవాస కార్మికుల గాధ-Telugu NRI People Living At Parks In UAE

కేవలం ఇమ్మిగ్రేషన్ రుసుము చెల్లించలేకపోవడంతో విమాన చార్జీలకి వారివద్ద డబ్బులు లేక కనీసం తినడానికి తిండికూడా లేకపోవడంతో అక్కడ పార్కులలో తల దాచుకుంటున్నారు.ఇది గమనించిన కేరళాకి చెందినా కొంతమంది ఎన్నారైలు వారికి ఆహారానికి సాయం చేస్తున్నారు అయితే వీరి గురించి తెలుసుకున్న దుబాయిలోని ఏపీ ఎన్నార్టీ ప్రతినిధు లు ఆదివారం రాత్రి అక్కడికి వెళ్లారు. ఏపీకి చెందిన 11మందికి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఏపీ ఎన్నార్టీ తరఫున ఉచితంగా విమాన టికెట్లు అందజేస్తామన్నారు.

అయితే తెలంగాణా ప్రభుత్వం కూడా తమను ఆదుకొని స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సహాయపడాలని తెలంగాణ యువకులు విజ్ఞప్తి చేస్తున్నారు…మేము మోసపోయాం ఉపాధి వీసా అనిచెప్పి సందర్శక వీసాపై పంపారని, నిర్మల్‌జిల్లా కుంటాలమండలానికి చెందిన రాంజీ రమేశ్‌ తెలిపాడు దుబాయిలో ఇలాంటి పరిస్థితి ఎదురవడం చాలా బాధగా ఉందని పశ్చిమగోదావరిజిల్లా మొగల్తూరుకు చెందిన ప్రసాద్‌ చెప్పాడు.అయితే తెలంగాణా ప్రభుత్వం కూడా స్పందించి తెలంగాణా వాసులని వారి రాష్ట్రానికి తీసుకు వెళ్లాలని వేడుకుంటున్నారు.