సుమ, రాజీవ్‌లు దత్తత తీసుకున్నారు.. వీరిది ఎంత గొప్ప మనస్సో!  

Suma And Rajeev Kanakala In Kerala Floods Helping-

Social media sources say that the decision of Telugu top anchor Suma and her husband Rajiv Kanagala is an ideal choice for filmmakers. The long-standing anchor, Suma, has long been a top anchor in Telugu. Suma who is more popular than Tollywood heroines occasionally loses his own good heart. Recently, a large amount of donations to help the victims of Kerala flood victims claim.

.

It is known to me that Suma was very worried when she was trapped in the flood that flourished in Kerala. Thousands of losses in floods in Kerala have been damaged. That is why the DMK has called for donors to come to the aid of the Chief Minister of Kerala. He wants us to help him. At this time many buildings were destroyed in a very important Alppy area in Kerala. The government announced that donors should come forward and repair those buildings. . According to the government's announcement, any building in Alappi can be adopted and can be repaired completely. As soon as the statement came, the couple came forward to repair a family welfare building there. The couple said that they are repairing the Family Welfare Building which is very important for the people and thanked the Sub Collector who told them about the adoption. .

. Like the couple, the people of the cinema are coming up to adopt, and that is when people come to believe that Kerala will come back to the previous form. Hundreds of crores of rupees have already been donated. The Government of Kerala announced that it would carry out relief programs. .

తెలుగు టాప్‌ యాంకర్‌ సుమ, ఆమె భర్త నటుడు రాజీవ్‌ కనకాల తీసుకున్న నిర్ణయం సినీ వర్గాల వారికి ఆదర్శనీయం అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. భారీ ఎత్తున యాంకర్‌గా గుర్తింపు ఉన్న సుమ తెలుగులో సుదీర్ఘ కాలంగా టాప్‌ యాంకర్‌గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. టాలీవుడ్‌ హీరోయిన్స్‌ కంటే ఎక్కువగా గుర్తింపును దక్కించుకున్న సుమ అప్పుడప్పుడు తన మంచి మనసును కూడా చాటుకుంటూ ఉంటుంది...

సుమ, రాజీవ్‌లు దత్తత తీసుకున్నారు.. వీరిది ఎంత గొప్ప మనస్సో!-Suma And Rajeev Kanakala In Kerala Floods Helping

ఇటీవల సుమ కేరళ వరద బాదితుల సహాయార్థం భారీ మొత్తంలో విరాళం ప్రకటించిన విషయం తెల్సిందే.

తాను పుట్టి పెరిగిన కేరళ వరదల్లో చిక్కుకుని అల్లాడుతున్న సమయంలో సుమ చాలా మనోవేదనకు గురైనట్లుగా అందరికి తెలిసిన విషయమే. కేరళలో వరద బీభత్సంతో వేల కోట్ల నష్టం వాటిల్లింది.

దాంతో కేరళ సీఎం ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలంటూ పిలుపు ఇచ్చాడు. తమకు తోచిన మేరకు సాయం చేయాలంటూ ఆయన కోరుతున్నాడు. ఇదే సమయంలో కేరళలో చాలా ముఖ్యమైన అలప్పీ ప్రాంతంలో ఎన్నో భవనాలు నాశనం అయ్యాయి..

ఆ భవనాలను దాతలు ముందుకు వచ్చి, బాగు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వం ప్రకటన ప్రకారం అలప్పీలోని ఏదైనా భవనంను ఒకరు దత్తత తీసుకుని, దాన్ని పూర్తిగా బాగు చేయించే అవకాశం ఉంది. ఇలా ప్రకటన రాగానే సుమ దంపతులు వెంటనే అక్కడ ఉండే ఒక ఫ్యామిలీ వెల్ఫేర్‌ బిల్డింగ్‌ను బాగు చేయించేందుకు ముందుకు వచ్చారు.

తాము ప్రజలకు ఎంతో అవసరం అయ్యే ఫ్యామిలీ వెల్ఫేర్‌ బిల్డింగ్‌ను రిపేర్‌ చేయిస్తున్నామని, తమకు దత్తత విషయం గురించి చెప్పిన సబ్‌ కలెక్టర్‌ గారికి కృతజ్ఞతలు అంటూ సుమ దంపతులు చెప్పుకొచ్చారు.

సుమ దంపతుల మాదిరిగానే సినిమా పరిశ్రకు చెందిన ప్రముఖులు ఇలా దత్తతకు ముందుకు రావాలని, అలా వచ్చినప్పుడే కేరళ మళ్లీ మునుపటి రూపంకు వస్తుందనే నమ్మకంను అక్కడి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వందల కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయి. వాటితో సహాయక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నట్లుగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది.