ఆ కుక్క ఏడాదిగా రేషన్ బియ్యం తీసుకుంటుంది..అసలు విషయం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు..  

Strange : Ration Rice For Dog In Odia Village Of Madhya Pradesh…-

ఆధార్ లేక ఇక్కడ మనుషులకే రేషన్ ఇవ్వట్లేదు.మీరేంటి కుక్కకు రేషన్,నక్కకు రేషన్ అని కొత్త కబుర్లు చెప్తున్నారు అనుకుంటున్నారా...

ఆ కుక్క ఏడాదిగా రేషన్ బియ్యం తీసుకుంటుంది..అసలు విషయం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు..-Strange : Ration Rice For Dog In Odia Village Of Madhya Pradesh…

కానీ కుక్క కూడా రేషన్ సరుకులు తీసుకుంటోంది.ఏం కుక్కు మాత్రం కడుపుండదా.

దానికి ఆకలివేయదా.అందుకే మనిషిలా అది కూడా రేషన్ సరుకులు తీసుకుంటుంది.పాపం ఈ సంగతి తెలియక రేషన్ డీలర్ కొన్నేళ్లుగా రేషన్ ఇస్తూనే ఉన్నడు.

ఇదంతా అర్దం కావాలంటే చదవాల్సిందే.

మధ్యప్రదేశ్‌లోని ధర్ జిల్లా, బోడియా గ్రామానికి చెందిన నర్సింగ్ బోదార్ రేషన్ షాపులో గతేడాదిగా క్రమం తప్పకుండా రేషన్ సరుకులు తీసుకుంటున్నాడు.రేషన్ కార్డులో తను, తన భార్య, కుమారుడి పేర్లు వున్నాయి. నెలకు ముగ్గురిలో ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం చొప్పున 18 కిలోల బియ్యం పొందుతున్నాడు. ఈ క్రమంలో బోడియా చౌకధరల దుకాణంలో ఆధార్ కార్డులను తనిఖీ చేసే పని పెట్టుకున్నారు. నర్సింగ్ బోదార్ తన భార్యది, తనది ఆధార్ కార్డుల జిరాక్స్ వాపీలు వారికి సమర్పించాడు.

మరి కొడుకు రాజు ఆధార్ కార్డ్ ఏదని వారు అడగ్గా. అదా రాజు అంటే అది తన పెంపుడుకుక్క పేరు అని, దాన్ని తన కొడుకుగా పెంచుకుంటున్నామని తాపీగా సమాధానం చెప్పాడు...

నర్సింగ్ సమాధానంతో రేషన్ షాపువాళ్ళకు తలతిరిగి నేలకు కొట్టుకున్నంత పనైంది. ఇంతకాలం కుక్కకు రేషన్ సరుకులు ఇస్తున్నామా అని ధర్ పౌరసరఫరాలశాఖ అధికారి ఆనంద్ గోలే లబోదిబోమన్నారు.

నర్సింగ్‌కు రేషన్ కార్డు గ్రామపంచాయితీలో ఇచ్చారని అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి కుక్క పేరిట రేషన్ సరకులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాలశాఖ అధికారి తెలిపారు.

‘పాపం పేదవాడు.కుక్క ఆకలి తీర్చడం కష్టమే కదా,పోనీ వదిలేయండి అంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయ పడితే…అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఘటన అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.