కేటీఆర్ కు ఓ సాఫ్త్వేర్ ఉద్యోగి ఘాటైన ట్వీట్.! అతను అడిగింది కరెక్ట్ అంటారా.?  

  • మంత్రి కేటీఆర్‌కు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఘాటైన ట్వీట్ చేశాడు. తన పేరు శివ అని మణికొండలో నివాసం ఉంటున్నానని క్రమం తప్పకుండా ట్యాక్సులన్నీ చెల్లిస్తున్నానని కానీ ఆఫీసు‌కు వెళుతున్న దారిలో కాజాగూడ వద్ద కొన్ని నెలల నుంచి ఓ నిర్మాణం జరుగుతోంది. దీని వల్ల రోడ్డు గతుకులు పడి… అధ్వాన్నంగా మారడంతో ఇవాళ తాను ప్రమాదానికి గురయ్యాను అని తెలిపాడు. ఇదే ఓ ఎమ్మెల్యేకో ఎంపీకో ఏదైనా జరిగి అతను మరణించవరకు మీరు స్పందించరా? అంటూ ఘాటుగా ప్రశ్నించాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజెన్స్ అందరు అతను ప్రశ్నను సమర్థిస్తున్నారు.

  • Software Employee Asks Strong Question To Ktr-

    Software Employee Asks Strong Question To Ktr

  • తాను ట్యాక్సులన్నీ చెల్లిస్తున్నాను… కానీ నిర్మాణాల పేరిట ఇబ్బందులు తప్పడం లేదని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కేటీఆర్‌కు ట్వీట్‌ చేశాడు. శివ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కేటీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ, హైదరాబాద్‌ సిటీ పోలీసులకు అడ్రస్‌ చేస్తూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్ కు ట్విట్టర్ లో ఆక్టివ్ గా ఉండే కేటీఆర్ గారు ఎలా స్పందిస్తారో చూడాలి. ఆ సాఫ్ట్ వెర్ ఉద్యోగి అడిగిన దానిలో నిజం ఉంది కదా అంది. మీరు అతన్ని సమర్దిస్తే కామెంట్ లో తెలపండి.!