సముద్రమట్టానికి 4500అడుగుల ఎత్తులో ఇంజినీరింగ్ అద్బుతం : సిక్కింలో తొలి విమానాశ్రయం  

Sikkim Airport Launch: Sikkim Gets Its First Airport-

సిక్కిం చిరకాల కోరిక తీరింది.ఇప్పటివరకు దేశంలో విమానాశ్రయం లేని రాష్ట్రం ఏదన్న ఉందా అంటే అది సిక్కిమే...

సముద్రమట్టానికి 4500అడుగుల ఎత్తులో ఇంజినీరింగ్ అద్బుతం : సిక్కింలో తొలి విమానాశ్రయం-Sikkim Airport Launch: Sikkim Gets Its First Airport

విమానం ఎక్కాలంటే పక్క రాష్ట్రమైన వెస్ట్ బెంగాల్ కి వెళ్లాల్సిన పరిస్థితి.కానీ ఇప్పుడు సముద్రమట్టానికి 4500అడుగుల ఎత్తులో సిక్కింలో విమానాశ్రయం రూపుదిద్దుకుంది.మామూలుగా విమానం ఎక్కాకా ఆకాశపు అంచులను తాకుతాం…కానీ ఆకాశంలోనే విమానం ఎక్కితే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది.అచ్చంగా అలాంటి ఫీలే కలుగుతుంది.

సిక్కిం విమానాశ్రయంలో విమానం ఎక్కుతుంటే.

సిక్కింలో తొలి విమానాశ్రయం ప్రారంభమయింది…మన ప్రధాని నరేంధ్రమోడి ఈ విమానాశ్రయాన్ని లాంచనంగా ప్రారంభించారు. గ్యాంగ్‌టక్‌కు 33 కిలోమీటర్ల దూరంలోని పాక్యాంగ్‌లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. సుమారు తొమ్మదేళ్ల క్రితం ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగింది.

.

అప్పటినుండి నేటి వరకు ఎన్నో సంక్లిష్టతల మధ్య 9 ఏళ్లు శ్రమించి రూ.605 కోట్ల వ్యయంతో,990ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఇది ఈశాన్య భారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం. సముద్రమట్టానికి 4,500 అడుగుల ఎత్తులో ఉన్న నిర్మించిన ఒక ఇంజినీరింగ్ అద్భుతంగా దీన్ని పరిగణిస్తున్నారు…అత్యంత సుందరమైన విమానాశ్రయం ...

ప్యాక్యాంగ్ విమానాశ్రయం 100విమానాశ్రయం.ఇప్పటివరకు సిక్కిం రాజధాని గాంగ్ టక్ చేరుకోవాలంటే పశ్చిమబెంగాల్లోని బాగ్దోగ్రా విమానాశ్రయాన్ని ఆశ్రయించేవారు.

ఇది సిక్కిం చిరకాల కలే కాదు,మన దేశ చిరకాల కల నెరవేరిందని చెప్పవచ్చు. అక్టోబర్‌ 4వ తేదీ నుంచి ఢిల్లి, గ్యాంగ్‌టక్‌, కోల్‌కతా, గువాహటిలకు ఇక్కడి నుంచి విమాన సేవలు ప్రారంభమవ్వనున్నాయి.