అంతా వద్దన్నా కూడా ఆయన మాత్రం సాయి పల్లవిని కోరుకుంటున్నాడు  

Shekar Kammula Wants Sai Pallavi In His Next-

మలయాళ ప్రేమమ్‌ చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌డంను దక్కించుకుని మలయాళంలోనే కాకుండా సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ మొత్తం తన స్టార్‌డంను దక్కించుకుంది. తెలుగులో ఈమె ‘ఫిదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా హీరో వరుణ్‌ తేజ్‌కు జోడీగా సాయి పల్లవి ఆ చిత్రంలో నటించింది. వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లోనే ఆ చిత్రం సూపర్‌ హిట్‌గా, భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతటి విజయాన్ని సాయి పల్లవి కారణంగానే వరుణ్‌ తేజ్‌ అందుకున్నాడు అంటూ అంతా విశ్లేషించారు.

Shekar Kammula Wants Sai Pallavi In His Next-

Shekar Kammula Wants Sai Pallavi In His Next

తన నటనకు, తన పద్దతికి ప్రేక్షకులు ఫిదా అవ్వడంతో పాటు, విమర్శకులు ప్రశంసలు కురిపించడం, నిర్మాతలు ఈమె ముందు క్యూ కట్టడంతో ఈమెకు డిమాండ్‌ బాగా పెరిగింది. ఈ సమయంలోనే ఈమె హీరోలతో దురుసుగా ప్రవర్తించడం, హీరోల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడటం చేస్తూ వచ్చింది. కణం చిత్రం సమయంలో నాగశౌర్యతో, ఎంసీఏ చిత్రం సమయంలో నానితో, పడిపడి లేచే మనసు చిత్రంలో శర్వానంద్‌తో ఈమె సున్నం పెట్టుకుంది. దాంతో ఈమెపై టాలీవుడ్‌ వర్గాల్లో కోపం ఉంది.

సాయి పల్లవి వివాదాలకు మారు పేరుగా నిలవడంతో ఫిల్మ్‌ మేకర్స్‌ ఈమెను దూరంగా పెట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఈమెకు తెలుగులో పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఈ సమయంలోనే శేఖర్‌ కమ్ముల మరోసారి ఈమెతో కలిసి సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నాడు. తమిళంలో రెండు మూడు సినిమాలు చేస్తున్న సాయి పల్లవి త్వరలోనే శేఖర్‌ కమ్ముల చేయబోతున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది. అందరు వద్దనుకుంటూ వెలి వేస్తున్నా కూడా శేఖర్‌ కమ్ముల ఒక్క ఛాన్స్‌ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. శేఖర్‌ కమ్ముల తనకు లైఫ్‌ ఇచ్చాడు కనుక ఆమె ఈ చిత్రంలో అయినా గౌరవంగా నడుచుకుంటుందేమో చూడాలి.

Shekar Kammula Wants Sai Pallavi In His Next-

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ తనయుడిని హీరోగా పరిచయం చేసే అవకాశం శేఖర్‌ కమ్ములకు దక్కింది. ఆ చిత్రంలో సాయి పల్లవిని హీరోయిన్‌గా ఎంపిక చేశాడు. మొదట కొత్త హీరోకు కొత్త హీరోయిన్‌ అయితే బాగుంటుందని శేఖర్‌ కమ్ముల భావించాడు. కాని సాయి పల్లవి అయితేనే ఆ పాత్రకు న్యాయం చేస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో తెరకెక్కబోతున్న ఈ చిత్రంను తమిళంలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఫిదా చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న ఈ దర్శకుడు మరో సక్సెస్‌తో సాయిపల్లవి స్థాయిని మరింతగా పెంచుతాడేమో చూడాలి.