'నా కూతురు నన్ను రౌడీలతో బెదిరిస్తోంది' అని కూతురుపై కేసు పెట్టిన సీనియర్ నటుడు. అసలేమైంది?  

Senior Actor Vijay Kumar Files Police Complaint Against Daughter-

షూటింగ్‌ కోసం ఇంటిని అద్దెకు తీసుకుని, ఖాళీ చేయకుండా ఆక్రమించుకుందని సీనియర్‌ నటుడు విజయకుమార్‌ తన కూతురు వనితపై స్థానిక మధురవాయిల్‌ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు.అందులో స్థానిక మధురవాయిల్, అలపాక్కమ్‌లోని అష్టలక్ష్మి నగర్‌ 11వ వీధిలో తనకు ఇల్లు ఉందన్నారు. అయితే షూటింగ్‌ పూర్తి అయినా వనిత ఇంటిని కాళీ చేయడం లేదని, అడిగితే రౌడీలు, న్యాయవాదులతో బెదిరిస్తోందని పేర్కొన్నారు.

Senior Actor Vijay Kumar Files Police Complaint Against Daughter-

Senior Actor Vijay Kumar Files Police Complaint Against Daughter

వివరాల లోకి వెళ్తే…అలపాక్కమ్‌లోని అష్టలక్ష్మి నగర్‌ 11వ వీధిలో విజయ్ కుమార్ కు ఇల్లు ఉంది. దాన్ని షూటింగ్‌లకు అద్దెకు ఇస్తూ, తాను తన కొడుకు అరుణ్‌తో కలిసి కొట్టివాక్కమ్‌లో నివశిస్తున్నట్లు తెలిపారు.వారం రోజుల క్రితం తన కూతురు షూటింగ్‌ కోసం అపపాక్కమ్‌లోని ఇంటిని అద్దెకు అడగడంతో ఇచ్చానన్నారు. అయితే షూటింగ్‌ పూర్తి అయినా వనిత ఇంటిని కాళీ చేయడం లేదని, అడిగితే రౌడీలు, న్యాయవాదులతో బెదిరిస్తోందని పేర్కొన్నారు.

Senior Actor Vijay Kumar Files Police Complaint Against Daughter-

ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న మధురవాయిల్‌ పోలీస్‌మిషనర్‌ విచారణ చేస్తున్నారు. కాగా గురువారం పోలీసులు విజయకుమార్‌ ఇంటికి వెళ్లి కేసు విషయమై వనితను విచారించగా ఈ ఇంట్లో తనకు భాగం ఉందని, అందువల్ల తాను కాళీ చేయనని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అలా అనడంతో పోలీసులు వనితను ఇల్లు మీది అనడానికి ఆధారాలు చూపించండి అన్నారు. నిత పోలీసులతో వాగ్వాదం చేస్తున్న విషయం గురించి తెలియడంతో మీడియా వాళ్లు అక్కడికి చేరారు. దీంతో వనిత మీడియా వాళ్లపై తిరగబడింది. కొందరు ఫొటోగ్రాఫర్ల కెమెరాలను లాగి నేలకేసి కొట్టింది. ఇంతకు ముందు కూడా వనిత కుటుంబాల మధ్య గొడవలు జరిగాయన్నది గమనార్హం.