భారత సంతతి అధికారికి..బ్రిటన్ ప్రతిష్టాత్మక అవార్డు  

  • భారత నుంచీ వలసలు వెళ్ళిన భారతీయులు అత్యధికంగా అమెరికా, బ్రిటన్, దుబాయ్ కంట్రీస్ లోస్థిరపడిపోయారు . అక్కడ వివిధ రంగాలలో ఉన్నత స్తాయిలకి వెళ్తూ తమదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు.అంతేకాదు ఎంతో కీలకమైన పదవులని సైతం పొందుతూ భారత సంతతి వ్యక్తులుగా ఇండియా కి గుర్తింపు తీసుకువస్తున్నారుఈ క్రమంలో ఎంతో మంది ఉన్నత స్తాయిలకి వెళ్ళిన సంఘటనలు తెలుసుకుంటే భారతీయులకి ఎంతో గర్వంగా ఉంటుందిఇప్పుడు అలాంటి సంఘటనే బ్రిటన్ లో జరిగింది

  • Scotland Yard's First Indian-origin Counter-terror Chief Wins Award-

    Scotland Yard's First Indian-origin Counter-terror Chief Wins Award

  • బ్రిటన్ వచ్చి ఎప్పుడో స్థిరపడిపోయిన భారత సంతతికి చెందిన ఒక వ్యక్తీ ఈ రోజు బ్రిటన్ లోని స్కాట్‌లాండ్‌ యార్డ్‌లో తీవ్రవాద నిరోధక దళానికి నేతృత్వం వహిస్తూ ఎంతో గొప్ప అధికారిగా పేరు పొందాడుఆయనే భారత సంతతి చెందిన అధికారి నీల్‌ బసు నీల్ బసు తను అందించిన సేవలకి గాను ప్రతిష్ఠాత్మక ‘ఆసియన్‌ అచీవర్స్‌ అవార్డ్‌” దక్కించుకున్నారు . అసిస్టెంట్‌ కమిషనర్‌ హోదాలో ఉన్న నీల్‌ బసు యూకే పోలీసు విభాగానికి అందిస్తున్న సేవలకు గాను ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.

  • Scotland Yard's First Indian-origin Counter-terror Chief Wins Award-
  • ఏబీపీఎల్‌ (ఆసియన్‌ బిజినెస్‌ పబ్లికేషన్స్‌ లిమిటెడ్‌) అనే మీడియా సంస్థ శుక్రవారం రాత్రి లండన్‌లో నిర్వహించిన 18వ వార్షిక అవార్డుల ప్రదానోత్సవానికి బసు తరఫున ఆయన సహోద్యోగి హాజరై అవార్డు అందుకున్నారు. బసు తండ్రి భారతీయుడు…అయితే బ్రిటన్ లోనే చదువుని కొనసాగించిన నీల్ ఎంతో ప్రతిభావంతుడుగా చిన్నతనంనుంచే ప్రసంసలు అందుకునే వాడనిఇప్పుడు ఈ అవార్డ్ రావడం సంతోషంగా ఉందని కుటుంభ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.