స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త రూల్...ఇకపై క్యాష్ డిపాజిట్ చేయడం కుదరదు.! కారణం ఇదే.!  

Sbi Implements New Rules Will Not Be Able Deposit Cash In Others-

 • ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు డబ్బులు బదిలీ చేస్తుండటంలో మోసాలను అరికట్టేందుకు చర్యలు ప్రారంభించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).డబ్బును ఒక ఖాతాలోకి వేసేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

 • స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త రూల్...ఇకపై క్యాష్ డిపాజిట్ చేయడం కుదరదు.! కారణం ఇదే.!-SBI Implements New Rules Will Not Be Able Deposit Cash In Others

 • దీనికి సంబంధించి కొత్త రూల్స్ తీసుకొని రానుంది. ఒక వ్యక్తి మరో వ్యక్తి ఖాతాలోకి డబ్బులు వేయరాదు.

 • సొంత కుటుంబ సభ్యులైనా సరే వారి కుటుంబ సభ్యుడి ఖాతాలో డబ్బులు వేయరాదంటూ కొత్త నిబంధన తీసుకురానుంది. ఇక ఇది అమలులోకి వస్తే ఎంతో మంది కస్టమర్ లు ఇబ్బంది పడటం కాయం.

 • మరి అలాంటప్పుడు ఈ కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.?

  SBI Implements New Rules Will Not Be Able Deposit Cash In Others-

  ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన మోసపూరిత లావాదేవీలే. పెద్ద నోట్ల రద్దు సమయంలో చాలా వరకు మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని ఎస్బీఐ వెల్లడించింది.

 • ఖాతాదారుడి అనుమతి లేకుండానే డబ్బులు వారి అకౌంట్లో డిపాజిట్ అయినట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఎస్బీఐ ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది.

 • SBI Implements New Rules Will Not Be Able Deposit Cash In Others-

  డబ్బులు ఇకపై బ్రాంచీ నుంచి మరో అకౌంట్‌కు వేయరాదు అనే నిబంధన త్వరలో రానుంది. అయితే ఇక్కడ కొంత ఊరటనిచ్చే అంశమేమిటంటే ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ కానీ, డిపాజిట్ కానీ చేసుకోవచ్చు. కాకపోతే బ్యాంకు కు వెళ్లి డబ్బులు డిపాజిట్ చేయాలంటే… ఏ ఖాతాలో అయితే డబ్బులు డిపాజిట్ చేస్తున్నారో ఆ ఖాతాదారుడు క్యాష్ డిపాజిట్ చేసేందుకు అనుమతిస్తూ ఓ లేఖను ఇవ్వాల్సి ఉంటుంది.

 • ఒక్కసారి ఆ అప్లికేషన్ ఫామ్ నింపి బ్యాంకుకు అందించిన తర్వాత ఆ సంబంధిత ఖాతాలోకి ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేసే అవకాశముంటుంది.