సాయి పల్లవి హింస.. శర్వామూవీ రెండు నెలలు ఆలస్యం  

Sarvanand Movie Getting Late About Arogency Of Sai Pallavi-

‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మలయాళి ముద్దుగుమ్మ సాయి పల్లవి టాలీవుడ్‌లో మంచి ఆఫర్లు దక్కించుకుంటుంది. అయితే ఈ అమ్మడు తల బిరుసు కారణంగా విమర్శలు ఎదుర్కొంటుంది. కాస్త పొగరుగా ప్రవర్తించే ఈమెతో ఇప్పటికే నటించిన హీరోలు అంతా కూడా గొడవ పడ్డారు అంటూ సమాచారం అందుతుంది...

సాయి పల్లవి హింస.. శర్వామూవీ రెండు నెలలు ఆలస్యం-Sarvanand Movie Getting Late About Arogency Of Sai Pallavi

ఈమె మొదటి చిత్రం ‘ఫిదా’ సమయంలో దర్శకుడు శేఖర్‌ కమ్ములతో మరియు వరుణ్‌ తేజ్‌తో చిన్న చిన్న గొడవలు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత దిల్‌రాజుతో ఈమె విభేదాలు పెట్టుకుంది.

శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటిస్తాను అంటూ ఓకే చెప్పి, ఆ తర్వాత ఆమె సినిమా నుండి తప్పుకోవడంతో అంతా కూడా అవాక్కయ్యారు. ఆ తర్వాత ఈమె కణం అనే చిత్రంలో నటించింది.

ఆ చిత్రం షూటింగ్‌ సమయంలో హీరో నాగశౌర్యతో గొడవ పడటం జరిగింది. ఆ విషయాన్ని స్వయంగా నాగశౌర్య చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి ‘పడిపడి లేచే మనసు’ అనే చిత్రంలో నటిస్తుంది..

ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో కూడా శర్వాతో గొడవ పడ్డట్లుగా సమాచారం అందుతుంది.

శర్వానంద్‌ మరియు హీరోయిన్‌ సాయిపల్లవి గొడవ కారణంగా షూటింగ్‌ అనుకున్నట్లుగా జరగడం లేదని, దర్శకుడు మరియు హీరో శర్వానంద్‌ను హీరోయిన్‌ సాయిపల్లవి చిరాకు పెడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. సాయి పల్లవి సరిగా సహకరించకపోవడం వల్లే సినిమా ఆలస్యం అవుతుందని సమాచారం అందుతుంది.

ఇక ఈ చిత్రం డిసెంబర్‌కు విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఫిబ్రవరికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. సాయి పల్లవి ట్యాంలెంటెడ్‌ హీరోయిన్‌ అయినప్పటికి, ఇలా తప్పులు చేస్తూ మంచి అవకాశాలను మిస్‌ చేసుకుంటుంది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.