సంపూ ఏంటీ ఈ కంపు పనులు.. నీ కొబ్బరిమట్ట పాడుగాను  

Sampoornesh Babu Shit Dialogues In Kobbari Matta-

హృదయకాలేం చిత్రంతో హీరోగా సంపూర్నేష్‌బాబు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మొదటి చిత్రంతోనే ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు, సంపూర్నేష్‌బాబు అంటే ఒక బ్రాండ్‌ అన్నట్లుగా క్రియేట్‌ చేశాడు. రికార్డు స్థాయిలో ఈయనకు సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్‌ నమోదు అయ్యాడు...

సంపూ ఏంటీ ఈ కంపు పనులు.. నీ కొబ్బరిమట్ట పాడుగాను-Sampoornesh Babu SHit Dialogues In Kobbari Matta

ఆ చిత్రం తర్వాత సంపూ మొదలు పెట్టిన చిత్రం ‘కొబ్బరి మట్ట’ దాదాపు మూడు ఏళ్లుగా ఈ చిత్రంకు సంబంధించిన షూటింగ్‌ జరుపుతూనే ఉన్నారు. ఎట్టకేలకు కొబ్బరి మట్ట విడుదలకు సిద్దం అయ్యింది. నవంబర్‌ 14న ఈ చిత్రంను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం కొబ్బరి మట్ట సినిమాకు సంబంధించిన ఒక విషయం సోషల్‌ మీడియాలో రచ్చ అవుతుంది.

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 1 మాజీ పార్టిసిపెంట్స్‌ అంతా కూడా కొబ్బరి మట్ట సాంగ్‌ ప్రోమో విడుదలకు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఈ సాంగ్‌ ప్రోమో మరీ ఎబెట్టుగా ఉంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక అన్న తమ్ముళ్లను చిన్నపిల్లల మాదిరిగా చూసుకుంటూ ఉండే ఆ పాటలో ఒక తమ్ముడు ఒంటికి కట్టుకున్న టవల్‌ విప్పినప్పుడు పక్కన వ్యక్తి ఎంత ఎదిగి పోయాడు అంటూ చేసిన లేకి కామెంట్స్‌ అందుకు సంపూ ఇచ్చిన ఎక్స్‌ ప్రెషన్స్‌ ప్రస్తుతం విమర్శలపాలు అవుతుంది.

కొబ్బరి మట్ట సినిమా మొత్తంలో ఇలాంటి చెత్త కంపు కామెడీ ఎంత ఉందో అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. కొబ్బరి మట్ట టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన సంపూర్నేష్‌బాబు ఈ చిత్రంతో 50 కోట్లను వసూళ్లు చేసినా ఆశ్చర్యం లేదు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. అయితే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాల నేపథ్యంలో సినిమాకు మంచి బిజినెస్‌ అవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.

నవంబర్‌ 14న ఈ చిత్రం విడుదలై ఎలాంటి ఫలితాన్ని సంపూకు ఇస్తుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.