చైతూకు సమంత ఇవ్వబోతున్న మొదటి పెళ్లి రోజు కానుక ఏంటో తెలుసా..!  

  • అక్కినేని హీరో నాగచైతన్య మరియు సమంతలు సుదీర్ఘ కాలం ప్రేమించుకున్న తర్వాత గత నెలలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లిని రెండు మతాల సాంప్రదాయాల ప్రకారం చేసుకున్నారు. వీరి పెళ్లి తర్వాత అన్యోన్యమైన జీవితంను గడుపుతున్నారు. వీరిద్దరు పెళ్లి తర్వాత వెంటనే సినిమాలతో బిజీ అయ్యారు. తాజాగా నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ మరియు సమంత ‘యూటర్న్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు చిత్రాలు కూడా ఒకే రోజు విడుదలైన విషయం తెల్సిందే.

  • Samantha Unique Gift For Hubby Chaitu On First Wedding Anniversary-

    Samantha Unique Gift For Hubby Chaitu On First Wedding Anniversary

  • ‘యూటర్న్‌’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా సమంత మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో మీరు నాగచైతన్యకు ఇవ్వబోతున్న మొదటి పెళ్లి రోజు గిఫ్ట్‌ ఏంటీ అంటూ విలేకరి ప్రశ్నింగా అందుకు సమాధానంగా అక్టోబర్‌ 6న మేమిద్దరం కలిసి నటించబోతున్న చిత్రం షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. షూటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం కావడమే చైతన్యకు నేను ఇచ్చే మొదటి పెళ్లి రోజు కానుక అంటూ చెప్పుకొచ్చింది. సినిమా ప్రారంభం పెళ్లి రోజు కానుక ఎలా అవుతుందని సోషల్‌ మీడియాలో జనాలు ప్రశ్నిస్తున్నారు.

  • Samantha Unique Gift For Hubby Chaitu On First Wedding Anniversary-
  • ‘ఏమాయ చేశావే’, ‘ఆటోనగర్‌ సూర్య’, ‘మనం’ చిత్రాల్లో ఆకట్టుకున్న ఈ జంట త్వరలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంతో పోల్చితే ఈ చిత్రం చాలా విభిన్నం అని చెప్పుకోవాలి. ఎందుకంటే నాగచైతన్య మరియు సమంతలు పెళ్లి తర్వాత చేయబోతున్న మొదటి చిత్రం ఇదే. అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

  • నాని హీరోగా నటించిన ‘నిన్నుకోరి’ చిత్రానికి దర్శకత్వం వహించిన శివ నిర్వాన త్వరలో ప్రారంభం కాబోతున్న చైతూ, సమంతల మూవీకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రంను ప్రముఖ రచయిత కోన వెంకట్‌ నిర్మిస్తున్నాడు. అక్టోబర్‌ 6 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ను జరుపనున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.