సమంత కలెక్షన్స్‌ పరంగా యూ‘టర్న్‌’ తీసుకుంది.. చైతూ పరిస్థితి ఏంటీ..  

Samantha U Turn Collections Ok But What About Sailaja Reddy Alludu-

సమంత అక్కినేని ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘యూటర్న్‌’. కన్నడ యూటర్న్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై తెలుగు మరియు తమిళంలో భారీ అంచనాలు నమోదు అయ్యాయి. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రంను పవన్‌ కుమార్‌ తెరకెక్కించాడు...

సమంత కలెక్షన్స్‌ పరంగా యూ‘టర్న్‌’ తీసుకుంది.. చైతూ పరిస్థితి ఏంటీ..-Samantha U Turn Collections Ok But What About Sailaja Reddy Alludu

తెలుగు మరియు తమిళంలో ఒకే సారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు కాస్త కలెక్షన్స్‌ పరంగా వెనుక పడినట్లుగా అనిపించినా మెల్ల మెల్లగా కుదురుకుంటుంది. ఈ చిత్రం ఓవర్సీస్‌ కలెక్షన్స్‌ చూస్తుంటే ఆపరిస్థితి అర్థం అవుతుంది.

‘యటర్న్‌’ చిత్రం ఓవర్సీస్‌లో మొదటి రోజు కేవలం 10 వేల డాలర్లను మాత్రమే వసూళ్లు చేసింది. ఆ తర్వాత రోజు నుండి భారీగా వసూళ్లు పెరిగాయి.

రెండవ రోజు 35 వేల డాలర్లు, మూడవ రోజు అయిన శనివారం 80 వేల డాలర్లు, నాల్గవ రోజు అయిన ఆదివారం 85 వేల డాలర్ల వసూళ్లు నమోదు అయినట్లుగా సమాచారం అందుతుంది. లాంగ్‌ రన్‌లో యూటర్న్‌ చిత్రం మంచి వసూళ్లను అక్కడ వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. .

ఓవర్సీస్‌లో సమంత 5 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అచ్చు అలాగే ఉంది. మొదటి రెండు రోజులను కేవలం శైలజారెడ్డికే పరిమితం అయిన ప్రేక్షకులు ఆ తర్వాత యూటర్న్‌ వైపుకు టర్న్‌ అయినట్లుగా తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం అయిదు కోట్ల వరకు ఇప్పటికే షేర్‌ రాబట్టినట్లుగా సమాచారం అందుతుంది...

మరో వైపు తమిళంలో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ చిత్రం కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ఏమాత్రం నష్టం లేకుండా ఈచిత్రం వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.

ఇక ఈ చిత్రం విడుదలైన రోజే నాగచైతన్య శైలజారెడ్డి అల్లుడు విడుదల కావడం వల్ల కలెక్షన్స్‌ కాస్త తగ్గాయి అనే టాక్‌ వినిపిస్తుంది.