ఆ సినిమాలు డబ్బు కోసమే చేశా అంటున్న సమంతా  

Samantha About U Turn Movie-

టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత తాజాగా ‘యూటర్న్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి ఈ చిత్రంను విడుదల చేయబోతున్న సమంత మొదటి సారి చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి...

ఆ సినిమాలు డబ్బు కోసమే చేశా అంటున్న సమంతా-Samantha About U Turn Movie

సమంత ఈ చిత్రం కోసం చాలా కష్టపడటంతో పాటు, కొత్త హెయిర్‌ స్టైల్‌ను ప్రయత్నించిన విషయం తెల్సిందే. నటిగా తనకు పూర్తి స్థాయి సంతృప్తిని ఇచ్చిన చిత్రం అంటూ యూటర్న్‌ గురించి చెప్పుకొచ్చింది.

యూటర్న్‌ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా తన గత చిత్రాల గురించి మాట్లాడుతూ కెరీర్‌ ఆరంభంలో తెలియని తనంతో చాలా సినిమాలను అనవసరంగా ఒప్పుకున్నాను. ఆ సినిమాల వల్ల తనకు గుర్తింపు రాకపోగా తన నటన ఏమాత్రం ఇంప్రూ కాలేదు అంటూ చెప్పుకొచ్చింది.

సమంత గతంలో చేసిన కొన్ని సినిమాలను చూసుకున్న సమయంలో చీ ఆ చిత్రాను తాను ఎలా కమిట్‌ అయ్యానా అని ఆనుకుంటుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది. ఇక తాను గతంలో పోషించిన కొన్ని పాత్రల నటన చూస్తే తనకే నవ్వు వస్తుందని, ఆ పాత్రలో ఇంకా బెటర్‌గా నటించొచ్చు కదా అనుకుంటుందట..

కెరీర్‌ ఆరంభంలో తెలియని తనం మరియు అమాయకత్వం కారణంగా కొన్ని అనవసర తప్పిదాలు చేశాను అని, పారితోషికం చూశాను తప్ప ఆ సినిమా కథ మరియు పాత్రలను చూడలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇకపై మంచి పాత్రలు మరియు సినిమాలను మాత్రమే చేస్తాను అంటూ చెప్పుకొచ్చిన ఈ అమ్మడు యూటర్న్‌ చిత్రంతో తన భర్త నాగచైతన్యను ఢీ కొట్టబోతున్న విషయం తెల్సిందే.