నాకు పిల్లలు కావాలనే ఉంది.. చైతూ మాత్రం ఒప్పుకోవడం లేదు  

Samantha About Having A Baby With Naga Chaitanya-

 • టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత రేపు ‘యూటర్న్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రంపై సమంత చాలా ఆశలు పెట్టుకుంది.

 • నాకు పిల్లలు కావాలనే ఉంది.. చైతూ మాత్రం ఒప్పుకోవడం లేదు-Samantha About Having A Baby With Naga Chaitanya

 • సమంత నటించిన మొదటి లేడీ ఓరియంటెడ్‌ చిత్రం అవ్వడంతో పాటు, థ్రిల్లర్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రంకు మంచి బిజినెస్‌ జరిగింది. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా సమంత మీడియాతో మాట్లాడుతూ పిల్లల విషయాన్ని ప్రస్తవించింది.

 • గత సంవత్సరం నాగచైతన్యను వివాహం చేసుకున్న ఈమె పిల్లల కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

  Samantha About Having A Baby With Naga Chaitanya-

  చాలా కాలంగా ప్రేమలో ఉన్న నాగచైతన్య మరియు సమంతలు గత ఏడాది ఇరు కుటుంబాల సమక్షంలో ఒక్కటైన విషయం తెల్సిందే. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటూ జీవితాన్ని హాయిగా గడిపేస్తున్నారు.

 • ఈ సమయంలోనే సమంతను పిల్లలు ఎప్పుడు అంటూ ఒక మీడియా పర్సన్‌ అడగడం జరిగిందట. పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పుడెప్పుడు పిల్లల్ని కనాలా అని ఎదురు చూస్తున్నాను.

 • కాని చైతూకు మాత్రం ఇప్పట్లో పిల్లలు ఇష్టం లేదు. అందుకే నేను చైతూను ఒత్తిడి చేయడం లేదు అంటూ చెప్పుకొచ్చింది.

 • చైతూ ఎప్పుడంటే అప్పుడు నేను పిల్లలను కనేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

  Samantha About Having A Baby With Naga Chaitanya-

  నాగచైతన్య ప్రస్తుతం కెరీర్‌ పరంగా ఊగిసలాడుతూ ఉన్నాడు. అందుకే కెరీర్‌లో సెటిల్‌ అయిన తర్వాత తండ్రి అవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 • సమంత మాత్రం ఇప్పటికే స్టార్‌డంను దక్కించుకుంది. ఇంకా కూడా ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.

 • పిల్లల కోసం ఈమె సినిమాలను వదులుకోవాలని చూస్తుంది. కాని చైతూ మాత్రం సమంతను నటించమంటూ ఎంకరేజ్‌ చేస్తున్నాడట.

 • మంచి కథలు ఎంపిక చేసుకుని, వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తానంటూ సమంత చెబుతోంది.