సాహో ఎఫెక్ట్ సైనా నెహ్వాల్ బయోపిక్ పై పడింది! ఊహించని ట్విస్ట్  

సైనా నెహ్వాల్ బయోపిక్ నుంచి శ్రద్ధా కపూర్ ని తప్పించిన నిర్మాతలు. .

Saina Nehwal Biopic Team Remove Shradda Kapoor-indian Cinema,sahoo Movie,saina Nehwal Biopic,shradda Kapoor,tollywood

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ సాహో. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది. యూనివర్శల్ స్టాండర్డ్స్ లో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియోలతో ఇప్పటికే సినిమాపై కావాల్సినంత హైప్ ని క్రియేట్ చేసారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. ఆగష్టు 15న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శరద్దా కపూర్ హీరోయిన్ గా కీలక పాత్రలో నటిస్తూ ఉండటం ఆమె బల్క డేట్స్ ని ఇచ్చేసింది.

ఇదిలా ఉంటే సాహో కంటే ముందుగానే శ్రద్ధా కపూర్ సైనా నెహ్వాల్ బయోపిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఆమె పాత్రని స్టడీ చేయడం కోసం సైనా నెహ్వాల్ ని కూడా కలవడం జరిగింది. అయితే గతంలోనే సైనా నెహ్వాల్ శ్రద్ధా కపూర్ తన బయోపిక్ కథపై పెద్దగా ద్రుష్టి పెట్టడం లేదని, బ్యాట్మెంటైన్ కోసం శిక్షణ తీసుకోవడం లేదని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటె తాజాగా ఈ సినిమా నుంచి శ్రద్ధా కపూర్ ని తప్పించి పరిణితి చోప్రాని తీసుకున్నట్లు తెలుస్తుంది.