శైలజారెడ్డి అల్లుడు....యూటర్న్‌.. చిత్రాల్లో ఏది పై సాధించిందో తెలుసా..!  

Sailaja Reddy Alludu Versus U Turn Movie Collections-

అక్కినేని నాగచైతన్య, అను ఎమాన్యూల్‌ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ఇక ఈ చిత్రంతో పాటు సమంత నటించిన ‘యూటర్న్‌’ చిత్రం కూడా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భార్య, భర్తలు విడి విడిగా నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రావడం అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు...

శైలజారెడ్డి అల్లుడు....యూటర్న్‌.. చిత్రాల్లో ఏది పై సాధించిందో తెలుసా..!-Sailaja Reddy Alludu Versus U Turn Movie Collections

యూటర్న్‌ చిత్రంపై అంచనాలు పెద్దగా లేవు. కాని శైలజారెడ్డి అల్లుడుపై ఆసక్తిని రేకెత్తించాడు.

రెండు చిత్రాల్లో వేటికి అదే ఉంటుందని, తప్పకుండా రెండు చిత్రాలు ఆకట్టుకుంటాయి అంటూ అక్కినేని ఫ్యామిలీ సభ్యులు చెబుతూ వచ్చారు. అయితే సినిమాల విడుదల తర్వాత ఏది పై చేయి సాధించింది అనే విషయమై అందరిలో ఆసక్తి రేకెత్తుతోంది.

భారీ అంచనాల నడుమ రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన శైలజారెడ్డి అల్లుడుకు యావరేజ్‌ టాక్‌ దక్కగా, ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూటర్న్‌ చిత్రంకు మంచి టాక్‌ వచ్చింది. రివ్యూలు కూడా యూటర్న్‌కు పాజిటివ్‌గా వచ్చాయి. ఎక్కువ శాతం వెబ్‌ సైట్లు యూటర్న్‌ చిత్రానికి ఎక్కువ రేటింగ్‌ను ఇచ్చాయి..

కలెక్షన్స్‌ పరంగా చూసుకుంటే మాత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా శైలజారెడ్డి అల్లుడు మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టాయి. యూటర్స్‌ మాత్రం కాస్త స్లోగా వసూళ్లను మొదలు పెట్టింది. కమర్షియల్‌ చిత్రం అవ్వడంతో సహజంగానే శైలజారెడ్డి అల్లుడుకు భారీ ఓపెనింగ్స్‌ రావడం కామన్‌. కాని లాంగ్‌ రన్‌లో ఏ చిత్రం భారీగా వసూళ్లు దక్కించుకుంటుంది అనేది చూడాలి.

శైలజారెడ్డి అల్లుడు చిత్రం కేవలం తెలుగులోనే విడుదలైంది. కాని సమంత యూటర్న్‌ చిత్రం మాత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల అయ్యింది. రెండు భాషల్లో కలిపి మంచి వసూళ్లను రాబట్టే అవకాశం కనిపిస్తుంది...

థ్రిల్లర్‌ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉందంటూ రివ్యూలు వస్తున్నాయి. రివ్యూల పరంగా యూటర్న్‌ పై చేయి సాధిస్తే ఓపెనింగ్స్‌ పరంగా శైలజ రెడ్డి అల్లుడు పై చేయి సాధించాడు. ఫైనల్‌గా లాంగ్‌ రన్‌ కలెక్షన్స్‌ పరంగా ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.