చైతూకు అందనంత ఎత్తుకు చేరుకున్న సమంత..!  

Sailaja Reddy Alludu Versus U Turn Movie Box Office Collections-

అక్కినేని జంట నాగచైతన్య మరియు సమంతలు ఇటీవ ఒకే రోజున ‘శైలజారెడ్డి అల్లుడు’ మరియు యూటర్న్‌ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ రెండు చిత్రాల్లో నాగచైతన్య మూవీ మంచి ఓపెనింగ్స్‌ రాబట్టి నాల్గవ రోజు నుండి కలెక్షన్స్‌ తగ్గుముఖం పట్టాయి. అయితే సమంత నటించిన ‘యూటర్న్‌’ చిత్రం మాత్రం భారీగా వసూళ్లను రాబట్టలేక పోయింది..

చైతూకు అందనంత ఎత్తుకు చేరుకున్న సమంత..!-Sailaja Reddy Alludu Versus U Turn Movie Box Office Collections

ముఖ్యంగా ఈ చిత్రం ఓపెనింగ్స్‌ విషయంలో తీవ్రంగా నిరాశ పర్చింది. అయితే లాంగ్‌ రన్‌లో మాత్రం చైతూ మూవీని బీట్‌ చేసేలా అనిపిస్తుంది.

ఓవర్సీస్‌లో మొదటి రోజే శైలజా రెడ్డి అల్లుడు లక్ష డాలర్లను వసూళ్లు చేయడం జరిగింది. ఆ తర్వాత రెండు మూడు రోజుల పాటు శైలజా రెడ్డి అల్లుడు సందడి చేశాడు.

మొత్తంగా రెండు లక్షలకు కాస్త అటు ఇటుగా మాత్రమే నాగచైతన్య మూవీ వసూళ్లు సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా చైతూ మూవీ పరిస్థితి అలాగే ఉంది. మంచి ఓపెనింగ్స్‌ అయితే రాబట్టుకున్న ఈ చిత్రం లాంగ్‌ రన్‌లో ఆ కలెక్షన్స్‌ను పెంచుకోవడంలో మాత్రం విఫలం అయ్యింది..

కాని యూటర్న్‌ మాత్రం అలా కాదు.

ఓవర్సీస్‌లో ‘యూటర్న్‌’ చిత్రం మొదటి రోజు కేవలం పాతిక వేల డాలర్లను మాత్రమే వసూళ్లు చేసింది. అక్కడ నుండి ప్రతి రోజు పెరుగుతూనే వస్తున్నాయి. ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో యూటర్న్‌ చిత్రం మూడు లక్షల డాలర్లకు చేరుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

యూటర్న్‌ చిత్రంకు సంబంధించిన వసూళ్ల విషయంలో ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది..

తెలుగు రాష్ట్రాల్లో శైలజా రెడ్డి అల్లుడు చిత్ర కలెక్షన్స్‌ను సమంత యూటర్న్‌ క్రాస్‌ చేయడం కష్టమే. కాని శైలజా రెడ్డి అల్లుడు చిత్రం కంటే యూటర్న్‌ చిత్రం ఓవర్సీస్‌లో భారీ వసూళ్లను రాబట్టి చైతూకు సమంత అందనంత ఎత్తులో ఉందని, ఓవర్సీస్‌లో సమంత తన స్టార్‌డంను చూపించింది అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.