రివ్యూలతో సంబంధం లేకుండా అల్లుడిగారి కలెక్షన్స్‌..  

Sailaja Reddy Alludu Movie Unbelievable Collections-

అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా, అను ఎమాన్యూల్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం షూటింగ్‌ దశలోనే మంచి బిజినెస్‌ను సాధించిన విషయం తెల్సిందే. మారుతి గత చిత్రాల సక్సెస్‌ కారణంగా ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు...

రివ్యూలతో సంబంధం లేకుండా అల్లుడిగారి కలెక్షన్స్‌..-Sailaja Reddy Alludu Movie Unbelievable Collections

నాగచైతన్య కెరీర్‌లోనే ఈ చిత్రం అత్యధిక ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేయడం జరిగింది. ఇక విడుదల తర్వాత కూడా ఈ చిత్రం అలరిస్తుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఈ చిత్రంకు నెగటివ్‌ రివ్యూలు వచ్చాయి.

ఆశించిన స్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ లేదు అంటూ రివ్యూలు వచ్చాయి.

ఈమద్య కాలంలో రివ్యూలను బట్టి కలెక్షన్స్‌ వస్తున్న విషయం తెల్సిందే. కాని రివ్యూలతో సంబంధం లేకుండా ఈ చిత్రం వసూళ్లను రాబడుతూ అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద గీత గోవిందం తప్ప మరే పెద్ద సినిమా లేకపోవడంతో, ఇప్పటికే ఆ చిత్రంను చూసేసిన ప్రేక్షకులు ఈ చిత్రం వెంట పడుతున్నారు.

అందుకే తొలి రోజు ఈ చిత్రం భారీగా వసూళ్లను రాబట్టింది. ఇక రెండవ రోజు పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు టెన్షన్‌ పడ్డారు. కాని అనూహ్యంగా సినిమా రెండవ రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టింది...

మొదటి రోజు వినాయక చవితి మరియు సెలవు దినం అవ్వడం వల్ల ఏకంగా 7 కోట్ల షేర్‌ను దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇర రెండవ రోజు సినిమాకు ఏకంగా నాలుగున్నర కోట్ల షేర్‌ దక్కినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇక మూడవ మరియు నాల్గవ రోజుల్లో సెలవు కారణంగా ఏకంగా అయిదు కోట్ల మేరకు షేర్‌ దక్కే అవకాశం ఉందని, దాంతో సినిమా సేఫ్‌ జోన్‌లో పడ్డట్లే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్సీస్‌లో ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతున్న కారణంగా సినిమాకు మంచి కలెక్షన్స్‌ దక్కుతున్నాయి.