రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రస్తుతం విజయవాడ వైపు చూస్తున్నారు.దాదాపుగా మూడు రోజులపాటు కురిసిన వర్షాలతో పాటు ఎగువ వైపు కురిసిన వర్షాల కారణంగా విజయవాడ ( Vijayawada )మొత్తం నీట మునిగిన విషయం తెలిసిందే.
కొన్ని ప్రదేశాలలో ఏకంగా రెండు మూడు అంతస్తుల ఎత్తుకు నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు.ఇప్పటికే కొంతమంది మరణించగా మరికొందరు ఇళ్ల పైకి ఎక్కి ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని గుప్పు గుప్పు మంటూ బతుకుతున్నారు.
ఆహారం కోసం నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు.
ప్రభుత్వం కూడా అక్కడ ఏర్పాట్లు చేయడంతో పాటుగా వరద బాధితులను రక్షించేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.
ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎం ఇలా ప్రతి ఒక్కరు కూడా అక్కడే ఉండి అక్కడికి కావాల్సిన వారికి సదుపాయలను సమకూరుస్తున్నారు.మరొకవైపు ఏపీ ప్రభుత్వానికి సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకులు నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి.
విజయవాడకి ప్రజలకు వరద బాధితులకు సహాయం చేయడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు.ఇప్పటికే డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.
అదేవిధంగా మహేష్ బాబు( Mahesh Babu ) కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు.స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ( Star Hero Junior NTR )కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు.అదేవిధంగా డార్లింగ్ ప్రభాస్ ఏకంగా ఐదు కోట్ల రూపాయలు వరద బాధితులకు సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా మరో మెగా హీరో వరద బాధితులకు సహాయం చేసి గొప్ప మనసును చాటుకున్నారు.
ఆ హీరో మరెవరో కాదు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ).
ఈ మేరకు సాయి ధరంతేజ్ విజయవాడ వరద ప్రాంతాలపై వరద బాధితుల గురించి సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకి చెరో 10 లక్షలు.అదే విధంగా విజయవాడ లో నేను మన మెగా అభిమానులు మరియు జనసైనికులు నడిపిస్తున్న అమ్మ ఆశ్రమం మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలకు 5 లక్షలు.
అలా మొత్తం 25 లక్షలు నా వంతు విరాళంగా ప్రకటిస్తున్నాను.ఈ కష్టాలన్నీ త్వరగా సమసిపోవాలని దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అని సాయి ధరంతేజ్ తన ట్విట్ లో పేర్కొన్నారు.