రవితేజను భయపెట్టిన విజయ్‌ దేవరకొండ.. ఎలాగో తెలుసా!  

Ravi Raja Feras With Vijay Devarakonda Nota Movie-

Vijay Devarakonda Time is a youth icon in Tollywood. Vijay Devarakonda's next film 'Noatta' is going to be a big hit with Arjun Reddy and Geeta Govindam. The recent release of the Nota movie trailer has been a good response. A large scale note is being planned to release. Director Anand Shankar says that the film will have all the secrets to impress. With the release of the film, Ravi Teja 'Amar Akbar Antony' has been postponed.

.

Raviteja Amar Akbar wanted to release Anthony's film with the intention of holidays despite the release of NTR's next film as Dasara's gift. But it is not good to release his film in the wake of Vijay Devarakonda's coming up to create a tsunami with the latest nota. That is why the film is planned to be released in December. .

There is not much speculation about the film 'Amar Akbar Antony' directed by Srinu Vaitla. That is why producers expect to release the film in solo and good time. The producers are expected to lose the collections if Dasara is released in the film. In the present scenario, Vijay casts a strong contribution to NTR's film and the 'NATA' NTR Aravindan film is over for a week. Even though there is some kind of tension atmosphere, the film industry is bleeding. Vijay Devarakonda has become a sensation with two films. Sweats for the stars too ..

ప్రస్తుతం టాలీవుడ్‌లో యూత్‌ ఐకాన్‌ విజయ్‌ దేవరకొండ టైం నడుస్తున్న విషయం తెల్సిందే. ‘అర్జున్‌ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలతో స్టార్‌ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ తదుపరి చిత్రం ‘నోటా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే విడుదలైన నోటా చిత్రం ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ దక్కింది..

రవితేజను భయపెట్టిన విజయ్‌ దేవరకొండ.. ఎలాగో తెలుసా!-Ravi Raja Feras With Vijay Devarakonda Nota Movie

భారీ ఎత్తున నోటా చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ చెబుతున్నాడు. ఇక ఈ చిత్రం విడుదలతో రవితేజ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రం విడుదల వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.

దసరా కానుకగా ఎన్టీఆర్‌ అరవింద సమేత చిత్రం విడుదల ఉన్నా కూడా సెలవులు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశ్యంతో రవితేజ అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రంను విడుదల చేయాలని భావించారు. కాని తాజాగా నోటాతో సునామిని సృష్టించేందుకు విజయ్‌ దేవరకొండ వస్తున్న నేపథ్యంలో తన సినిమాను విడుదల చేయడం ఏమాత్రం మంచిది కాదని రవితేజ భావిస్తున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. అందుకే సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

శ్రీనువైట్ల దర్శకత్వంలో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు. ఆ కారణంగానే సినిమాను సోలోగా, మంచి సమయంలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

సినిమా పాజిటివ్‌ టాక్‌ దక్కించుకున్నా కూడా దసరాకు విడుదల చేస్తే కలెక్షన్స్‌ నష్టపోవాల్సి ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయ్‌ సినిమా అటు ఎన్టీఆర్‌ సినిమాకు కూడా గట్టి పోటీ ఇస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

‘నోటా’కు ఎన్టీఆర్‌ అరవింద సమేత చిత్రంకు వారం రోజులకు పైగా గ్యాప్‌ ఉంది.

అయినా కూడా కాస్త టెన్షన్‌ వాతావరణం కనిపిస్తున్నట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి విజయ్‌ దేవరకొండ రెండు సినిమాలతోనే సెన్షేషన్‌ అయ్యాడు. స్టార్‌లకు కూడా చెమటలు పట్టిస్తున్నాడు.