బాబోయ్‌.. 150 పంది పిల్లలను ఎందుకు పెంచావ్‌ రవిబాబు..  

Ravi Babu Starts A Pig Farm For Adhugo-

Various films director Ravi Babu has been wrestling with 'Aadgo' for the past two years. Ravi Babu did not disappear after announcing that he was making a film with a pig baby. After that, Ravi Babu appeared on the occasion of the pig baby and announced the release of the latest release date. Dasara is going to release the film 'Aadgo' with a lot of interesting things about the film, which increases expectations.

.

Recently, Ravi Babu released his film teaser. Only the pig baby has shown and laughs and the director is ready to release the trailer soon. Ravi Babu has come up with news from the first to raise the pig baby for the film, he also said. In a recent interview, Ravi Babu said that he had raised 150 pig babies. . Speaking at a media briefing by Ravi Babu as part of 'Aadgo' Pramon, he started shooting with a pig baby first. While the shooting is slow, the pig baby has grown weight. The baby's shape changed within three months. So I brought another pig baby. That is why I brought 150 pig children to the next one. Ravi Babu has taken so much care to be all the same. .

. Naturally celebts are puppies, or if they grow kittens. But Ravi Bibhu is the nickname for the film so he has a rare record of raising pig children for his film. After the release of the movie Ravi Babu, the movie is about making a movie.

..

..

..

విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు గత రెండు సంవత్సరాలుగా ‘అదుగో’ చిత్రంతో కుస్తీ పడుతున్నాడు. పంది పిల్లతో ఒక చిత్రాన్ని చేస్తున్నాను అంటూ ప్రకటించిన రవిబాబు కొన్నాళ్లు కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత పంది పిల్లతో అప్పుడప్పుడు బయటకు కనిపించిన రవిబాబు తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించాడు...

బాబోయ్‌.. 150 పంది పిల్లలను ఎందుకు పెంచావ్‌ రవిబాబు..-Ravi Babu Starts A Pig Farm For Adhugo

దసరాకు విడుదల కాబోతున్న ‘అదుగో’ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను చెబుతూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు.

ఇటీవలే రవిబాబు తన సినిమా టీజర్‌ను విడుదల చేశాడు. కేవలం పంది పిల్లను మాత్రమే చూపించి, నవ్వించిన ఈ దర్శకుడు త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఇక రవిబాబు ఈ చిత్రం కోసం పంది పిల్లను పెంచినట్లుగా మొదటి నుండి వార్తలు వచ్చాయి, ఆ విషయాన్ని ఆయన కూడా చెప్పుకొచ్చాడు.

తాజాగా రవిబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏకంగా 150 పంది పిల్లలను తాను పెంచినట్లుగా పేర్కొన్నాడు. .

‘అదుగో’ ప్రమోన్‌లో భాగంగా రవిబాబు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. మొదట తాను ఒక పంది పిల్లతో షూటింగ్‌ ప్రారంభించాను.

షూటింగ్‌ నెమ్మదిగా జరుగుతుండగా ఆ పంది పిల్ల మాత్రం బరువు పెరిగి పోయింది. మూడు నెలల్లోనే ఆ పిల్ల రూపం మారిపోయింది. దాంతో తాను మరో పంది పిల్లను తీసుకు వచ్చాను.

అలా ఒకదానికి తర్వాత ఒకటి అన్నట్లుగా ఏకంగా 150 పంది పిల్లలను తీసుకు వచ్చి పెంచాను. అన్ని ఒకేలా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా రవిబాబు పేర్కొన్నాడు.

సహజంగా సెలబ్రెటీలు కుక్క పిల్లలు లేదంటే పిల్లి పిల్లలను పెంచుకుంటాడు. కాని రవిబాబు మాత్రం విభిన్నంకు మారు పేరు కనుక తన సినిమా కోసం పంది పిల్లలను పెంచుకుని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సినిమా మేకింగ్‌ విషయంలోనే సంచలనం సృష్టించిన రవిబాబు సినిమా విడుదలైన తర్వాత మరెంతగా ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి.