ఎన్టీఆర్‌కు భయపడ్డ వర్మ.. ఒక్క రోజు ఆలస్యం చేస్తున్నాడు  

Ramgopal Varma\'s Movie Will Release After Jr Ntr\'s Movie-

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎవరికి భయపడే వ్యక్తి కాదు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసేందుకు ఎప్పుడు వెనుకడడు. తాజాగా వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడుతున్నాయి...

ఎన్టీఆర్‌కు భయపడ్డ వర్మ.. ఒక్క రోజు ఆలస్యం చేస్తున్నాడు-Ramgopal Varma's Movie Will Release After Jr NTR's Movie

అయినా కూడా ఏమాత్రం వెనుకాడకుండా వరుసగా చిత్రాను చేస్తూనే ఉన్నాడు. తాజాగా ‘భైరవగీత’ అనే చిత్రాన్ని నిర్మించాడు. తన శిష్యుడి దర్శకత్వంలో వర్మ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

కన్నడం మరియు తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే వచ్చిన టీజర్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’ చిత్రంకు పోటీగా ఈ చిత్రంను అక్టోబర్‌ 11న విడుదల చేయబోతున్నట్లుగా వర్మ గతంలో ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే వర్మ గతంలో ప్రకటించినట్లుగా ఈ చిత్రంను అక్టోబర్‌ 11న కాకుండా, ఒక రోజు ఆలస్యంగా అంటే అక్టోబర్‌ 12న విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

అక్టోబర్‌ 11న విడుదల చేయడం వల్ల ఖచ్చితంగా కలెక్షన్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని అంతా అంటున్నారు. చూస్తూ చూస్తూ ఒక మంచి సినిమాను కిల్‌ చేయడం ఎందుకు అనే ఉద్దేశ్యంతో ఒక రోజు ఆలస్యంగా విడుదల చేస్తే పోయేది ఏమీ లేదు అనే ఉద్దేశ్యంతో వర్మ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతుంది.

‘అరవింద సమేత’ హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే 12వ తారీకున వచ్చినా కూడా ‘భైరవ గీత’ చిత్రంకు ఎఫెక్ట్‌ తప్పదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం అయిదు నుండి వారం రోజులు అయినా గ్యాప్‌ ఇస్తే బాగుండేదేమో అంటున్నారు. 12వ తారీకు అంటున్న వర్మ ఇంకా సినిమా హడావుడి మొదలు పెట్టలేదు. దాంతో మరోసారి ఎన్టీఆర్‌కు భయపడి వాయిదా వేశాడా ఏంటీ అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.