చెర్రీ పంపిన బహుమతికి మేనకోడల్లయితే హ్యాపీ..కానీ సుస్మిత నాట్‌ హ్యాపీ.! ఎందుకో తెలుసా.?  

  • మెగా కాంపౌండ్ అంటేనే సగం సినిమా స్టార్లు ఉన్న కుటుంబంఅటువంటి కుటుంబం నుండి నిహారికా మినహా సినిమా తెరపై మెరిసిన అమ్మాయిలు లేరు.సుస్మిత మాత్రం ఫ్యాషన్ డిజైనింగ్ మరియు స్టైలిస్ట్ గా వర్క్ చేస్తున్నారు.ఖైదీ నెం.150,మీ లో ఎవరు కోటిశ్వరుడు ప్రొగ్రాంలో తన తండ్రి చిరంజీవికి స్టైలిష్ట్ గా వర్క్ చేసింది సుస్మితనే

  • Ram Charan Surprise Gift To His Nephews-

    Ram Charan Surprise Gift To His Nephews

  • ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’కి సుస్మిత కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా చేస్తున్నారు. ఆమె అత్తారిల్లు చెన్నైలో…అయితే సినిమా నిమిత్తం చెన్నై నుంచి హైదరాబాద్‌ వస్తూ… వెళ్తూ… ఉండటం ఇబ్బందిగా ఉంటోందని ఎక్కువ రోజులు హైదరాబాద్‌లో ఉంటున్నారు.

  • ఇది ఇలా ఉండగారామ్‌చరణ్‌ పెట్‌ లవర్‌ అనే సంగతి తెలిసిందే. విభిన్న జాతులకు చెందిన గ్రామ సింహాలు, ఓ గుర్రం… ఇంకా అతడి దగ్గర చాలా పెట్స్‌ ఉన్నాయి. వాటిని ఆయన ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు! అంతే కాదు… ఇటీవల ఓ బుజ్జి కుక్క పిల్లను అక్క సుస్మితకు బహుమతిగా ఇచ్చారు. అయితే సుస్మితకు ఆ కుక్కపిల్లను ఇవ్వడం వెనక కారణం ఉంది అండోయ్. సుస్మిత పిల్లలు సమారా, సమీరా కుక్క పిల్లలతో సరదాగా ఆడుకోవడం గమనించిన చరణ్‌, అక్కకు బుజ్జి కుక్క పిల్లను బహుమతిగా పంపారు.

  • Ram Charan Surprise Gift To His Nephews-
  • ఆయన బహుమతి చూసి మేనకోడళ్లు ఇద్దరూ చాలా హ్యాపీ. కానీ, అక్క మాత్రం నాట్‌ హ్యాపీ. ఓ పక్క సినిమా పనులు చూసుకోవాలి. మరో పక్క ఇద్దరు పిల్లలు ఇంకో పక్క ఇంటికి కొత్తగా వచ్చిన కుక్క పిల్ల ముగ్గురి పనులు చూసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటోందట! ‘‘ఇద్దరు పిల్లలను పెంచడం కష్టంగా అనిపించలేదు గానీ… చిన్న కుక్క పిల్లను చూడటం కష్టంగా మారింది. ఎందుకంటే… పిల్లలు ఇద్దరూ దాంతో కలిసి అల్లరి అల్లరి చేస్తున్నారు. దాంతో ఒకసారి చరణ్‌కి ఫోన్‌ చేసి ‘నెల రోజులు చూస్తా. నా పిల్లలతో పాటు బుజ్జి కుక్కను హ్యాండిల్‌ చేయటం కుదరకపోతే నీకు ఇచ్చేస్తా. దాన్ని తిరిగి పంపిస్తా’ అని చెప్పా’’ అని సుస్మిత తెలిపారు. ‘‘అలా అంటాను గానీ…. తమ్ముడికి పంపేస్తానేంటి? పిల్లల సంతోషం ముఖ్యం కదా’’ అని నవ్వేశారు.