రాహుల్‌ గాంధీ చాలా హాట్‌.. బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ కామెంట్‌  

Rahul Gandhi So Hot Says Bollywood Top Actress-

Bollywood Beauty Hurricane Katrina Kaif is more likely to be in news than with his bold comments and photo shoots. This sells a recent interview. In that interview, he said several things. Kate, who did not express his interest in talking about his love and marriage, was talking about the ideal people in various fields. Similarly, Kate responded to the question of who the most hot people were in politics and attracted the attention of all.

.

బాలీవుడ్‌ బ్యూటీ కత్రీనా కైఫ్‌ ఈమద్య సినిమాలతో కంటే ఎక్కువగా తన బోల్డ్‌ కామెంట్స్‌, ఫొటో షూట్స్‌తో ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. ఈ అమ్మడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో పలు విషయాలను చెప్పుకొచ్చింది...

రాహుల్‌ గాంధీ చాలా హాట్‌.. బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ కామెంట్‌-Rahul Gandhi So Hot Says Bollywood Top Actress

తన ప్రేమ, పెళ్లి విషయాల గురించి మాట్లాడేందుకు ఆసక్తి వ్యక్తం చేయని కేట్‌ వివిధ రంగాల్లో తనకు ఆదర్శవంతులైన వ్యక్తుల గురించి మాట్లాడటం జరిగింది. అదే విధంగా రాజకీయాల్లో అత్యంత హాట్‌ వ్యక్తులు ఎవరు అనే ప్రశ్నకు కూడా విభిన్నమైన తరహాలో కేట్‌ సమాధానం ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.

రాజకీయ నాయకుల్లో ఎంతో మంది యువకులు ఉన్నారు. వారిలో మీకు అత్యంత హాట్‌ అనిపించే వ్యక్తి ఎవరు అంటూ ఈమెకు ప్రశ్న ఎదురు కాగా ఇద్దరి పేర్లను కత్రీనా చెప్పుకొచ్చింది.

ఆ ఇద్దరిలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కాగా, రెండవ వ్యక్తి కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ అంటూ చెప్పుకొచ్చింది. రాహుల్‌ గాంధీ ఇండియాలోనే అత్యంత హాట్‌ వ్యక్తి అంటూ కితాబు ఇచ్చింది. రాహుల్‌ గాంధీపై కత్రీనా చేసిన వ్యాఖ్య ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది...

గతంలో తనకు తాను హాఫ్‌ ఇండియన్‌ అంటూ కేట్‌ ప్రకటించుకుంది. అంటే తాను పూర్తిగా ఇండియన్‌ మాదిరిగా ఉండను అనేది తన అర్థం. అదే సమయంలో రాహుల్‌ గాంధీ కూడా హాఫ్‌ ఇండియన్‌ అంటూ చెప్పుకొచ్చింది.

అంటే రాహుల్‌ గాంధీ తల్లి సోనియా గాంధీ ఇటలీకి సంబంధించిన వ్యక్తి కనుక ఆయన కూడా హాఫ్‌ ఇండియన్‌ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, కాంగ్రెస్‌ నాయకుల చేత తిట్లు తినడం జరిగింది. కాని ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌ నాయకులు సంబురపడేలా వ్యాఖ్యలు చేసింది.

బాలీవుడ్‌లో మొన్నటి వరకు వరుసగా చిత్రాలతో చాలా బిజీగా ఉన్న కత్రీనా కైఫ్‌ ఇప్పుడు కాస్త జోరు తగ్గించిందని చెప్పుకోక తప్పదు. ఈమెకు ఈమద్య కాలంలో అవకాశాలు తగ్గాయి.

దాంతో ఐటెం సాంగ్స్‌తో పాటు, ముఖ్య పాత్రలకు కూడా సై అంటున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అంటూ సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.