ప్రియుడిని కత్తితో పొడిచింది... ఎందుకో తెలిస్తే ఇదేం ప్రేమరా బాబోయ్‌ అనిపించక మానదు  

Pregnant Woman Stabbed Boyfriend For Looking At Another Woman-viral In Social Media

ప్రేమలో ఉన్న వారు గుడ్డిగా మారిపోతారు అని అంటూ ఉంటారు. ఆ విషయం నిజమేనేమో అని కొన్ని సార్లు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమికులు కొన్ని సార్లు చేసే పనులు అలాగే ఉంటాయి మరి..

ప్రియుడిని కత్తితో పొడిచింది... ఎందుకో తెలిస్తే ఇదేం ప్రేమరా బాబోయ్‌ అనిపించక మానదు-Pregnant Woman Stabbed Boyfriend For Looking At Another Woman

ప్రియుడు లేదా ప్రేయసి తమను కాకుండా మరెవ్వరితో అయినా చనువుగా ఉన్నా లేదంటే ప్రేమించినా కూడా కోపోద్రిక్తులు అవ్వడం ఖాయం. అంలాంటి సమయంలో విచక్షణ కోల్పోయి దాడి చేసిన సంఘటనలు మనం చూశాం. అయితే ఇలాంటి సంఘటనల్లో ఎక్కువగా అమ్మాయిలు బలి అవుతారు.

అబ్బాయిలు కోపోద్రిక్తులు అవుతారు. కాని ఫ్లోరిడాలో మాత్రం అమ్మాయి చేతిలో అబ్బాయికి ఇలాంటి అనుభవం ఎదురైంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… అమెరికా ఫ్లోరిడాకు చెందిన జూలిట్టా ఎమిలీ అనే అమ్మాయిక ఒంత కాలంగా ఒక అబ్బాయితో ప్రేమలో ఉంది. ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు.

ఇద్దరు కూడా అన్ని రకాల ఎంజాయ్‌ మెంట్స్‌ చేశారు. హద్దులు మీరిన వారి ప్రేమకు గుర్తుగా జూలిట్టా ఎమిలీ గర్బం దాల్చింది. దాంతో మరింత ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లి చేసుకోవాలని వారు భావించారు..

మరి కొన్ని రోజుల్లో వారి పెళ్లి, అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఒప్పుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సమయంలో జూలిట్టా ఎమిలీ ఒక పనిపై ప్రియుడి రూంకు వెళ్లింది.

ఆ సమయంలో ఆమె ప్రియుడితో పాటు, అతడి స్నేహితుడు కూడా ఉన్నాడు. జూలిట్టాకు ప్రియుడి స్నేహితుడు తన స్నేహితురాలు అంటూ ఫొటో చూపించాడు. ఆ ఫొటోను జూలిట్టా చూసింది. అదే సమయంలో ఆ ఫొటోను జూలిట్టా ప్రియుడు తదేకంగా చూస్తే అమ్మాయి చాలా బాగుంది కదా, తన స్నేహితుడు లక్కీ అంటూ కామెంట్‌ చేశాడట.

తన ముందు వేరే అమ్మాయిని పొగడటంతో ఆమెకు చిర్రెత్తుకు వచ్చింది. వారి గొడవ ప్రారంభం అయ్యింది..

జూలిట్టా అతడిని రూంలోకి తీసుకు వెళ్లింది. లోపల చాలా పెద్ద గొడవ జరిగింది.

ఆ గొడవలో జూలిట్టా తన ప్రియుడిని కత్తితో పొడిచేసింది. కత్తితో జూలిట్టా పొడవటంతో ప్రియుడు బయటకు పరిగెత్తుకు వచ్చాడు. విషయం తెలిసిన ప్రియుడి స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు..

నా ముందే మరో అమ్మాయిని పొగుడుతావా అంటూ జూలిట్టా ఏడుపు స్వరంతో గట్టిగా మొత్తుకుంటూ అక్కడ నుండి వెళ్లి పోయేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలోనే పోలీసులు రావడం ఆమెను అరెస్ట్‌ చేయడం, ప్రియుడిని హాస్పిటల్‌కు తరలించడం జరిగి పోయింది.